పొంగల్ తర్వాత అప్ డేట్ – డైరెక్టర్ ప్రామిస్

#Prabhas21, Actor Prabhas Next Movie, Amitabh Bachchan In Prabhas 21, Ashwini Dutt, Deepika Padukone and Prabhas, Director Nag Ashwin, Nag Ashwin Promises A Big Update After Pongal, National Award winning director Nag Ashwin, Prabhas 21, Prabhas 21 Updates, Prabhas Latest Movie News, Prabhas Nag Ashwin Movie, Prabhas next movie, Prabhas upcoming movie, Superstar Amitabh Bachchan, Telugu Filmnagar

ప్రస్తుతం జిల్ ఫేమ్ రాధాకృష్ణా దర్శకత్వంలో ప్రభాస్, పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్‌తో ప్యాన్‌ ఇండియన్‌ సినిమాగా.. 1970 కాలంనాటి పీరియాడికల్ లవ్ స్టోరీ నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతుంది. గోపికృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం హిందీ, తెలుగు, తమిళ్ భాషల్లో రూపొందనుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

దీనితో పాటు నాగ్ అశ్విన్ తో ప్రభాస్ సినిమా ఉంటుందని మనకు తెలిసిందే కదా. అత్యంత భారీ బడ్జెట్‌తో సైన్ ఫిక్షన్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ పై నాగ్ అశ్విన్ క్లారిటీ ఇచ్చాడు. ప్రభాస్ సినిమా నుంచి న్యూ ఇయర్ లేదా సంక్రాతికి ఏదైనా అప్డేడ్ ఉందా? అని ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు నాగ్ అశ్విన్ రిప్లై ఇచ్చాడు. సంక్రాంతి తర్వాత మన సినిమా అప్డేట్ ఉంటుందని.. వర్క్ ఫుల్ ఫ్లోలో నడుస్తోందని నాగ్ అశ్విన్ చెప్పాడు.

ఇక బాలీవుడ్ హీరోయిన్ గా దీపికా పదుకొనె హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్ పై ప్రభాస్ రేంజ్‌కి తగ్గట్టుగా నిర్మాత అశ్వినీదత్ ఈ చిత్రాన్ని పాన్ వరల్డ్ రేంజ్ లో భారీ బడ్జెట్‌తో రూపొందించనున్నారు. ఈ సినిమా కోసం మరో లెజెండ్రీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు కూడా మెంటర్ గా పని చేయనున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.