కె.జి.యఫ్2 – టీజర్ రిలీజ్ కు డేట్ ఫిక్స్

Director Prashanth Neel, KGF 2 Climax Shooting, KGF Chapter 2, KGF Chapter 2 Movie, KGF Chapter 2 Movie Updates, KGF: Chapter 2 Movie News, Latest Still From KGF Chapter 2, Latest Tollywood News, sanjay dutt, Telugu Film News 2020, Telugu Filmnagar, Tollywood Movie Updates, Yash And Sanjay Dutt Wrap Up The Epic Climax Fight Sequence, Yash KGF Chapter 2

ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో యష్ హీరోగా తెరకెక్కిన భారీ ప్రాజెక్ట్ కె.జి.యఫ్ సంచలన విజయంతో ఇప్పుడు కె.జి.యఫ్ 2 కూడా చిత్రీకరిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా కోసం ఎంత మంది ఎదురుచూస్తున్నారో కూడా ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఇటీవలే షూటింగ్ ను మొదలుపెట్టగా హైద్రాబాద్ లో క్లైమాక్స్‌ చిత్రీకరించారు. తాజాగా షూటింగ్ ను కూడా పూర్తి చేసుకున్నట్టు తెలుస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ రోజు కె.జి.యఫ్ 2 సర్‌ప్రైజ్ ఉంటుందని చిత్ర యూనిట్ అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ సర్‌ప్రైజ్‌ ఏంటో కొద్దిసేపటి క్రితమే ప్రకటించారు. యష్ పుట్టినరోజు సందర్భంగా కె.జి.యఫ్ ఛాప్టర్ 2 టీజర్‌ను జనవరి 8న ఉదయం 10.18 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.

కాగా ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. బాలీవుడ్ స్టార్ యాక్ట‌ర్ సంజ‌య్ ద‌త్ ఈ చిత్రంలో అధీర అనే ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర‌లో న‌టిస్తున్నారు. రవీనాటాండన్ ఓ పవర్ ఫుల్ పొలిటీషియన్ పాత్రలో నటిస్తుంది. హోంబ‌లే ఫిలింస్, ఎక్సెల్ మూవీస్, వారాహి చలన చిత్రం బ్యానర్స్ పై  నిర్మిస్తున్న ఈ సినిమాకు ర‌వి బ‌స్రూర్ సంగీతం .. భువ‌న్ గౌడ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. మరి చూద్దాం ఇది ఎంత వరకూ సక్సెస్ అవుతుందో…ఎన్ని సంచలనాలు క్రియేట్ చేస్తుందో.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine + 17 =