ఫైనల్ షెడ్యూల్ లో ‘టక్ జగదీష్’

Natural Star Nani LaLatest Movie Tuck Jagadish Enters Final Schedule, Nani Latest Movie Tuck Jagadish, Nani Movie Tuck Jagadish Enters Final Schedule, Natural star Nani, Natural Star Nani Latest Movie, Natural Star Nani Latest Movie Details, Natural Star Nani Latest Movie Tuck Jagadish Enters Final Schedule, Telugu Filmnagar, Tuck Jagadish, Tuck Jagadish Enters Final Schedule, Tuck Jagadish Movie, Tuck Jagadish Movie Shoot, Tuck Jagadish Movie Shoot Updatesatest Movie Tuck Jagadish Enters Final Schedule

నాని స్పీడ్ మాములుగా లేదు. ఈ ఏడాది ‘V’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాకు మిశ్రమ ఫలితమే దక్కింది. ఇప్పుడు టక్ జగదీష్ సినిమా కూడా చివరి దశకు వచ్చింది. ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో నాని హీరోగా ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాగా “టక్ జగదీష్” సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్స్ లో నాని లుక్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇక లాక్ డౌన్ కు ముందే ఈ సినిమా కొంత వరకూ షూటింగ్ ను పూర్తి చేసుకోగా..  ఇటీవలే మళ్లీ షూటింగ్ ను స్టార్ట్ చేశారు చిత్రయూనిట్. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉండగా హైద‌రాబాద్‌లో చివ‌రి షెడ్యూల్లోకి ప్ర‌వేశించింది. హైద‌రాబాద్‌లో ప్రారంభ‌మైన చివరి షెడ్యూల్‌లో చిత్రంలోని ప్ర‌ధాన తారాగ‌ణ‌మంతా పాల్గొంటున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా రీతువర్మ, ఐశ్వర్యా రాజేష్ కథానాయికలుగా నటిస్తున్న ఈ సినిమాను… సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. ఇంకా సినిమాలో జగపతి బాబు, రావు రమేష్, నరేష్, నాజర్, దేవదర్శిని, రోహిణి, మాల పార్వతి, డేనియల్ బాలాజి,తిరువీర్, ప్రవీణ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా.. సినిమాటో గ్రఫీ ప్రసాద్‌ మూరెళ్ల అందిస్తున్నాడు.

కాగా ‘నిన్నుకోరి’ వంటి హిట్ సినిమా తర్వాత నాని – శివ నిర్వాణ కాంబోలో వస్తున్న సినిమా ఇది. ఆ సినిమా హిట్ అవ్వడంతో ఈ సినిమాపై కూడా మంచి అంచనాలే ఉన్నాయి. మరి ఆ అంచనాలను ఈ సినిమా రీచ్ అవుతుందా లేదా చూద్దాం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.