వర్కౌట్స్ విషయంలో మన హీరోలకు ఏమాత్రం తీసిపోవట్లేదు హీరోయిన్స్. సమంత, పూజా హెగ్డే, రకుల్, రష్మిక వీళ్లంతా ఫీల్ నెస్ కు ఎంతో ప్రాముఖ్యత ఇచ్చేవాళ్లే. ఒక రకంగా ఫిట్నెస్ ఫ్రీక్ అంటారుకదా ఆ టైప్ అన్నమాట. ఇక ఈ లాక్ డౌన్ లో అయితే ఇంట్లోనే ఉంటూ పలు రకాల వర్కౌట్స్ చేస్తూ వాటిని సోషల్ మీడియా ద్వారాఅభిమానులతో పంచుకున్నారు కూడా.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా తాజాగా రష్మిక తన బీచ్ వర్కౌట్స్ కు సంబందించిన వీడియో ఒకటి తన ఇన్స్టాలో పోస్ట్ చేసింది. అంతేకాదు.. నేను ఫస్ట్ టైం బీచ్ లో వర్కౌట్స్ చేస్తున్నా… చాలా అలిసిపోయా కానీ అలల శబ్దం.. సముద్రపు వాసన.. సన్ సెట్ ఇవన్నీ అడిక్ట్ చేసేలా ఉన్నాయి.. ఇక నుండి నేను ఎక్కడికి వెళ్లినా అక్కడ ఒక వర్కౌట్ వీడియో తీస్తాను అని తెలిపింది.
కాగా ప్రస్తుతం టాలీవుడ్ లోరష్మిక ఫుల్ ఫామ్ లో దూసుకుపోతుంది. తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగింది. ఈ ఏడాది `సరిలేరు నీకెవ్వరు`, `భీష్మ` వంటి విజయాలను తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం అల్లుఅర్జున్ సినిమా పుష్పలో నటిస్తుంది. ఈ సినిమాలోకూడా రష్మిక పాత్ర హైలైట్ అని చెపుతున్నారు. ఇక తమిళ్ లో కార్తీ హీరోగా తెరకెక్కుతున్న సుల్తాన్ సినిమాలో కూడా నటిస్తుంది. వీటితో పాటు కన్నడలో కూడా సినిమాలు చేస్తుంది.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























