హీరో సూర్య కు జోడీగా కాజల్ అగర్వాల్ ?

Kajal Aggarwal To Pair Up Once Again With Suriya After Brothers Movie

“గురు ” మూవీ ఫేమ్ సుధ కొంగర దర్శకత్వంలో స్టార్ హీరో సూర్య కథానాయకుడు గా రూపొందిన “సూరరై పోట్రు “(ఆకాశం నీ హద్దురా )తమిళ మూవీ అక్టోబర్ 30 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ OTT అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. హీరో సూర్య తన నెక్స్ట్ పిక్చర్ కు సన్నద్ధం అవుతున్నారు. యాక్షన్ థ్రిల్లర్ “మాత్త్రాన్ “(బ్రదర్స్ ) మూవీ లో సూర్య , కాజల్ అగర్వాల్ జంటగా నటించారు. సూర్య ఇప్పుడు తన అప్ కమింగ్ మూవీ లో కాజల్ ను హీరోయిన్ గా ఎంపిక చేయాలనుకొంటున్నారు .

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

టాలీవుడ్ , కోలీవుడ్ లలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న కాజల్ ప్రస్తుతం మెగా స్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న “ఆచార్య “, ఇంగ్లీష్ , తెలుగు భాషలలో రూపొందుతున్న “మోసగాళ్ళు “, సూపర్ స్టార్ కమల్ హాసన్ హీరోగా రూపొందుతున్నసూపర్ హిట్ “ఇండియన్ “తమిళ మూవీ సీక్వెల్ “ఇండియన్ 2 “, కొరియోగ్రాఫర్ బృంద దర్శకత్వంలో రూపొందుతున్న “హే సినమిక ” తమిళ మూవీ లో నటిస్తున్నారు.
ఈ మూవీస్ తో పాటు కాజల్ “ముంబై సాగ “హిందీ మూవీ లో నటిస్తున్నారు. “బ్రదర్స్” మూవీ లో జంటగా నటించి ప్రేక్షకులను అలరించిన సూర్య , కాజల్ మరోసారి ప్రేక్షకులను అలరించనున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.