తెలుగు , తమిళ , హిందీ భాషా చిత్రాలలో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని తమన్నా స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ తమన్నా ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ ప్రేక్షక , అభిమానులను అలరిస్తున్నారు. తమన్నా ప్రస్తుతం స్పోర్ట్స్ డ్రామా “సీటీ మార్ “, “బోలే చుడియన్ “(హిందీ ) మూవీస్ లో నటిస్తున్నారు. పలు తమిళ సూపర్ హిట్ మూవీస్ లో కథానాయికగా నటించిన తమన్నా కు ఇప్పుడు ఒక తమిళ మూవీ ఆఫర్ వచ్చిందని సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
వి క్రియేషన్స్ బ్యానర్ పై ఏ ఆర్ మురుగదాస్ దర్శకత్వంలో ఇళయ దళపతి విజయ్ , కాజల్ అగర్వాల్ జంటగా రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ “తుపాకి ” తమిళ మూవీ ఘనవిజయం సాధించింది. ఈ మూవీ తెలుగు డబ్బింగ్ వెర్షన్ కూడా సక్సెస్ అయ్యింది. ఇప్పుడు ఈ మూవీ సీక్వెల్ “తుపాకి 2 ” మూవీ రూపొందనుంది. “తుపాకి 2 ” మూవీ లో హీరోయిన్ గా తమన్నా ను సంప్రదిస్తున్నట్టు సమాచారం. “సుర ” మూవీ లో విజయ్ కు జోడీ గా నటించిన తమన్నా 10 సంవత్సరాల తరువాత “తుపాకి 2 ” మూవీ లో హీరో విజయ్ తో జతకట్టడం విశేషం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: