ఫ్యాన్స్, సాహో టీం కు ప్రభాస్ థ్యాంక్స్

Saaho Team Thank Fans as the film completes one year

బాహుబ‌లి సినిమా త‌ర్వాత ప్ర‌భాస్ న‌టించిన భారీ బ‌డ్జెట్ చిత్రం సాహో. కేవలం అప్పటికి ఒక్క సినిమానే తీసిన యంగ్ డైరెక్టర్ సుజీత్ ను నమ్మి ప్రభాస్ తీసుకున్న డేరింగ్ స్టెప్. ఇక తనమీద పెట్టుకున్న నమ్మకానికి పూర్తిగా న్యాయం చేసాడు సుజీత్ . యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌ నేపథ్యంలో.. పాన్ ఇండియా నేపథ్యంలో తెర‌కెక్కిన ఈ సినిమా అనేక భాష‌ల‌లో విడుద‌లైన విజ‌య‌బావుటా ఎగుర‌వేసింది. మొత్తం నాలుగు భాషల్లో తెరకెక్కిన ఈ సినిమాకు నిజానికి సౌత్ లో కంటే నార్త్ లోనే ఎక్కువ ఆదరణ లభించింది అని చెప్పొచ్చు. దానికి హిందీలో ఈ సినిమా రాబట్టిన కలెక్షన్సే ఉదాహరణ. సాహో హిందీ వర్షన్ తెలుగుకు మించి 150కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించింది. మొత్తంగా బాక్సాఫీస్‌ వద్ద ఈ సినిమా రూ. 425 కోట్లకుపైగా వసూళ్లు సాధించి పలు రికార్డ్‌లు సృష్టించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

క‌ళ్లు చెదిరే యాక్ష‌న్ సీన్స్ ప్రేక్షకుల రోమాలు నిక్క‌బొడుచుకునేలా చేశాయి. ప్ర‌భాస్ రేంజ్‌ని మ‌రింత పెంచిన ఈ చిత్రం ఆగ‌స్ట్ 30,2019న విడుదలయ్యి ఏడాది పూర్తి చేసుకుంది. ఈ సంద‌ర్భంగా సోష‌ల్ మీడియాలో ప్ర‌భాస్ అభిమానులు సాహో వ‌న్ ఇయర్ హ్యాష్ ట్యాగ్ క్రియేట్ చేసి తెగ ట్రెండ్ చేస్తున్నారు. ఇక ప్రభాస్ కూడా సోషల్ మీడియా ద్వారా తన మీద ఇంత ప్రేమ, సపోర్ట్ ఇస్తున్న డై హార్డ్ ఫ్యాన్స్ కు, సాహో టీంకు థ్యాంక్స్ చెప్పారు.

 

కాగా యూవీ క్రియేషన్స్‌ పై తెరకెక్కిన ఈ సినిమాలో ప్రభాస్‌ సరసన శ్రద్ధా కపూర్‌ హీరోయిన్‌గా నటించగా.. ఇంకా ఈ సినిమాలో జాకీష్రాఫ్‌, చంకీ పాండే, నీల్‌ నితిన్‌ ముఖేష్‌, అరుణ్ విజయ్‌, లాల్‌, వెన్నెల కిశోర్‌, మందిర బేడీలు ఇతర కీలక పాత్రల్లో నటించారు.

ప్రస్తుతం ప్రభాస్ రాధా కృష్ణ తో రాధే శ్యామ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగానే మరో రెండు సినిమాలను లైన్ లో పెట్టాడు. అందులో ఒకటి నాగ్ అశ్విన్ సినిమా కూడా వుంది. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్ పై భారీగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తుంది.

కాగా వీటితోపాటు ఓం రౌత్ దర్శకత్వంలో ‘ఆది పురుష్’ సినిమా కూడా చేస్తున్నాడు ప్రభాస్. మైథలాజికల్ సోషియో ఫాంటసీ ఎంటెర్టైనెర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను ప్రముఖ బాలీవుడ్ నిర్మాతలు భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్ భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా.. హిందీ, తెలుగు, కన్నడ, తమిళ్, మలయాళం భాషల్లో నిర్మిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight + fifteen =