పూజాహెగ్డే స్వీట్ మెమొరీ

Actress Pooja Hegde Shares An Inside Story Regarding The Shooting Of Ramuloo Ramulaa Song

గీతా ఆర్ట్స్ , హారిక &హాసిని బ్యానర్స్ పై త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ , సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ పూజాహెగ్డే జంటగా రూపొందిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ “అల .. వైకుంఠపురములో ..” మూవీ రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. నివేత పేతురాజ్, సుశాంత్ , సముద్రఖని ముఖ్య పాత్రలలో నటించారు. థమన్ ఎస్ సంగీతం అందించారు. థమన్ స్వరకల్పన లో “సామజవరగమన”, “బుట్టబొమ్మా “, “రాములో రాములా “సాంగ్స్ విశేష ప్రేక్షకాదరణ పొందాయి. రాములో రాములా సాంగ్ 300 మిలి యన్స్ వ్యూస్ సాధించి దక్షిణాది చిత్రపరిశ్రమలోనే మొదటి సాంగ్ గా రికార్డ్ క్రియేట్ చేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించి పూజాహెగ్డే టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ ఫొటోస్ , వీడియోస్ షేర్ చేసి ప్రేక్షక, అభిమానులను అలరిస్తున్న పూజాహెగ్డే ఇప్పుడు ఒక ఆసక్తికర వీడియో ను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. రాములో రాములా సాంగ్ చిత్రీకరణ సమయంలో అల్లు అర్జున్ , పూజాహెగ్డే , సుశాంత్ , నివేత పేతురాజ్ పాల్గొన్నారు. ఆ సాంగ్ లోని ఒక షాట్ ను దర్శకుడు త్రివిక్రమ్ సింగిల్ టేక్ లో ఓకే చేశారు. జనరల్ గా ఎక్కువమంది ఆర్టిస్ట్ లు పాల్గొనే షాట్ కు రీ టేక్స్ ఉంటాయి. ఎక్స్ ప్రెషన్స్ , టైమింగ్ ఆ షాట్ లో పర్ ఫెక్ట్ గా కుదిరాయని పూజాహెగ్డే ఆ షాట్ వీడియో ను సోషల్ మీడియా లో షేర్ చేశారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × one =