బ్లాక్ బస్టర్ “పెళ్ళిచూపులు ” మూవీ తో విజయ్ దేవరకొండ టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయ్యారు. సెన్సేషనల్ హిట్ “అర్జున్ రెడ్డి ” మూవీ లో విజయ్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఆ మూవీ తో అభిమానులలో క్రేజ్ పెంపొందించుకున్నారు. బ్లాక్ బస్టర్ “గీత గోవిందం ” మూవీ తో స్టార్ హీరోగా మారారు. విజయ్ నటించిన రెండు , మూడు సినిమాలు నిరాశ పరచినా అభిమానులలో విజయ్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. కరోనా లాక్ డౌన్ బాధితులకు విజయ్ తన వంతు సాయం అందించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్




హీరో విజయ్ దేవరకొండ త్రో బాక్ ఫోటో ప్రేక్షక అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. రఫ్ లుక్ లో ఉన్న విజయ్ ఫోటో ఆసక్తిని కలిగించింది. విజయ్ ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ “ఫైటర్ ” మూవీ లో నటిస్తున్నారు. పాన్ ఇండియా మూవీ గా రూపొందుతున్న “ఫైటర్ “మూవీ దక్షిణాది భాషలతో పాటు హిందీ లో కూడా రిలీజ్ కానుంది. ఈ మూవీ కై విజయ్ మార్షల్ ఆర్ట్స్ లో ట్రైనింగ్ పొందారు. “ఫైటర్ “మూవీ తో విజయ్ బాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: