పబ్లిసిటీ అన్నారు.. అందుకే అక్కడ సినిమాలకు దూరంగా ఉన్నా..!

Anupama Parameswaran Reveals The Reason Behind Staying Away From Mollywood

మలయాళం లో “ప్రేమమ్ ” అందరికీ గుర్తుండిపోయే సినిమా అది. ఇక ఈ సినిమాతోనే వెండితెరకు పరిచయమైంది అనుపమ పరమేశ్వరన్. తెలుగులో కూడా ప్రేమమ్ రీమేక్ తోనే పరిచయమైంది. ఇక ఆ తర్వాత సూపర్ హిట్ “అ ఆ ” మూవీలో తన నటనతో ఆకట్టుకొని వరుస అవకాశాలు అందిపుచ్చుకుంది. పలు తెలుగు సినిమాల్లో నటించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అయితే మలయాళం ప్రేమమ్ సినిమాతోనే పరిచయమైన అనుపమ ప్రేమమ్ తర్వాత పెద్దగా అక్కడ సినిమాలు చేయలేదు. ఎక్కువ తెలుగు సినీ పరిశ్రమపైనే ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూ లో దీనిగురించి మాట్లాడిన అనుపమ తాను మలయాళం ఇండస్ట్రీకి దూరంగా ఉండటానికి కారణం ఏంటో చెప్పింది. 2015 ప్రేమమ్ సినిమా ప్రమోషన్స్ అప్పుడు.. ఆ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చాలా ఇంటర్వ్యూల్లో పాల్గొన్నా… అయితే ఈ సినిమాలో లో నా నిడివి తక్కువ ఉండటంతో సినిమా చూసిన తర్వాత పబ్లిసిటీ కోసమే ఇలా చేశానని సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ చేశారు. సో అప్పుడే మలయాళం పరిశ్రమకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నా అని చెప్పింది. మొత్తానికి అనుపమ బాగానే హర్ట్ అయినట్టుంది లేకపోతే అంత నిర్ణయం ఎందుకు తీసుకుంటుంది. ఇప్పుడిప్పుడే అక్కడ సినిమాలు చేయడానికి ఒప్పుకుంటుంది .

ప్రస్తుతం అనుపమ నిఖిల్‌, చందు మెుండేటి కాంబినేష‌న్ లో వస్తున్న ‘కార్తికేయ2′ సినిమాలో నటిస్తుంది. దీనితో పాటు ’18 పేజీస్’ సినిమా కోసం కూడా అనుపమనే అనుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇవి కాక తమిళ్ లో ఒక సినిమా మలయాళంలో ఒక సినిమా చేస్తుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × five =