
గత రెండు నెలలకుపైగా దేశమంతటా లాక్‌డౌన్ కొనసాగుతున్నది. ఈ లాక్‌డౌన్ కారణంగా సినిమా షూటింగులన్నీ ఆగిపోయాయి. దురదృష్టమైన అంశం ఏంటంటే.జూన్ నుండి షూటింగ్స్ మొదలుపెట్టవచ్చని ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా… షూటింగ్స్ కు వెళ్లలేని పరిస్థితి. అప్పుడే రిస్క్ తీసుకోవడం ఎందుకని ఆలోచిస్తున్నారు. ఇదిలావుంటే మరో ఆరు నెలల దాక కూడా సినిమా థియేటర్లు తెరుచుకునే అవకాశాలు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో సినీ తారలంతా తమ రెమ్యునరేషన్‌ను తగ్గించుకోవాలనే డిమాండ్లు తెరపైకి వస్తున్నాయి. అంతేకాదు ఇప్పటికే కొంతమంది తమ రెమ్యూనరేషన్ ను తగ్గించుకున్నారు కూడా. ఇప్పుడు తాజాగా మరో హీరోయిన్ ఆ లిస్ట్ లో చేరిపోయింది. ఆ హీరోయిన్ ఎవరో కాదు కీర్తి సురేష్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రస్తుతం పరిస్థితుల నేపథ్యంలో కీర్తి సురేష్ తన రెమ్యూనరేషన్ ను తగ్గించుకుందట. ప్రస్తుతం తను మూడు నాలుగు ప్రాజెక్ట్స్ తో బిజీ గా వుంది. ఆ సినిమాలన్నిటికీ తన రెమ్యూనరేషన్ లో 20 నుండి 30 శాతం తగ్గించుకోడానికి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. మరి కీర్తి లాగే మిగిలిన హీరోయిన్స్ కూడా ముందుకొచ్చి ఈ నిర్ణయం తీసుకుంటే నిర్మాతలు కాస్త గట్టెక్కినట్టే.




ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వంలో కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో ‘పెంగ్విన్’ అనే సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా అన్ని పనులు కంప్లీట్ చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది. జూన్ 19వ తేదీన ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో విడుదల కానుంది.టీజర్ కు ట్రైలర్ కు మాత్రం సూపర్ రెస్పాన్స్ వచ్చింది. మరి సినిమా కూడా హిట్ అయితే.. దాదాపు చాలా సినిమాలు రిలీజ్ అయ్యే అవకాశం వుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


























