రష్మిక చాలా హార్డ్ వర్కర్.. !

Samantha Akkineni Hails Rashmika Mandanna
Samantha Akkineni Hails Rashmika Mandanna

ఇప్పుడున్న పోటీ వాతావరణంలో ఒక హీరోయిన్ గురించి ఇంకో హీరోయిన్ పొగడటం అంటే చాలా కష్టమైన విషయం. అయితే అందరూ అలానే ఉంటారని కాదులెండి. నాణానికి రెండు వైపులు ఉన్నట్టు.. కొంతమంది హీరోయిన్స్ మధ్య పచ్చగడ్డి వేస్తేనే భగ్గుమనే రేంజ్ లో కోల్డ్ వార్ నడుస్తూనే ఉంటుంది. అలానే కొంతమంది హీరోయిన్స్ ఎంతో స్నేహంగా వుంటారు. అలాంటి నేపథ్యంలో ఒక స్టార్ హీరోయిన్ ఇంకో హీరోయిన్ ను ప్రశంసిస్తే ఎలా ఉంటుంది. అలానే ఉంది ఇప్పుడు టాలీవుడ్ లో వరుస సినిమాలతో దూసుకుపోతున్న రష్మిక మందన్న పరిస్థితి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇంతకీ రష్మికను ప్రశంసించిన హీరోయిన్ ఎవరనుకుంటున్నారా?ఎవరో కాదు సమంత. శుక్రవారం సమంత ట్విట్టర్ ద్వారా తన అభిమానులతో ముచ్చటించారు. అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. తనకు ఇష్టమైన సినిమాల గురించి, క్వారంటైన్ పీరియడ్‌లో గడిపిన విషయాల గురించి, తన అత్తమ్మ అమల గురించి, ఇలా చాలా విషయాలే పంచుకున్నారు. ఈ నేపథ్యంలో ఒక నెటిజెన్.. రష్మిక మందన్నలో మీకు నచ్చిన లక్షణం? అని అడుగగా దానికి సమంత ఏమాత్రం ఆలోచించకుండా.. రష్మిక చాలా హార్డ్ వర్కర్.. కష్టపడేతత్వం ఉన్న మనిషి… తన డ్యాన్స్‌ చూస్తేనే ఆ విషయం అర్ధమవుతుంది అంటూ రష్మిక పై ప్రశంసలు కురిపించింది. మరి సమంత లాంటి హీరోయిన్ పొగిడిన తర్వాత రష్మిక ఊరుకుంటుందా వెంటనే తన ట్విట్టర్ ద్వారా హ్యాపీ ఎమోజీస్ పెట్టి తన సంతోషాన్ని వ్యక్తం చేసింది.

ఛలో సినిమాతో తెలుగు పరిశ్రమలోకి అడుగుపెట్టిన రష్మిక చాలా తక్కువ టైం లోనే స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగిపోయింది. స్టార్ హీరోల పక్క ఛాన్స్ లు కొట్టేస్తూ కెరీర్ లో దూసుకుపోతుంది. ప్రస్తుతం అల్లుఅర్జున్ సినిమా పుష్ప లో హీరోయిన్ గా నటిస్తుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 5 =