సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు హెచ్ వినోత్ దర్శకత్వంలో తమిళ సూపర్ స్టార్ తల అజిత్ కుమార్ హీరోగా బోనీ కపూర్ ఫిల్మ్స్ బ్యానర్ పై యాక్షన్ థ్రిల్లర్ “వాలిమై ” తమిళ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. హూమా ఖురేషి కథానాయిక కాగా హీరో కార్తికేయ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. “వాలిమై”మూవీ ని దీపావళి కానుకగా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. కరోనా వైరస్ కారణంగా ఈ మూవీ షూటింగ్ నిలిచిపోయింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
“వాలిమై”మూవీ షూటింగ్ ఫస్ట్ షెడ్యూల్ హైదరాబాద్ లో జరిగింది. ఈ మూవీ లో కీలకమైన రేసింగ్ సీన్స్ ను మొరాకో , స్పెయిన్ లలో చిత్రీకరణ జరపాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. కరోనా వైరస్ కారణంగా విదేశాలలో షూటింగ్ సాధ్యపడదు కనుక చిత్ర యూనిట్ లొకేషన్స్ ఛేంజ్ చేసినట్టు సమాచారం. రేసింగ్ సీన్స్ ఇండియాలోనే చిత్రీకరించాలని చిత్ర యూనిట్ భావిస్తున్నట్టు సమాచారం. దర్శకుడు హెచ్ వినోత్, హీరో అజిత్ కాంబినేషన్ లో రూపొందిన “నెర్కొండ పార్వై “మూవీ ఘనవిజయం సాధించింది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: