ముగ్గురు డైరెక్టర్స్ తో.. ముగ్గురు హీరోయిన్స్ తో సినిమా త్వరలోనే రాబోతుంది..!

Legendary Director K Raghavendra Rao Gives An Interesting Update Of His Previously Announced Movie On NTR Birth Anniversary
Legendary Director K Raghavendra Rao Gives An Interesting Update Of His Previously Announced Movie On NTR Birth Anniversary

దర్శకుడు రాఘవేంద్రరావు గత ఏడాది నేడు ఎన్టీఆర్ జయంతి సందర్బంగా కొత్త సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే. “నా యాభై ఏళ్ళ సినీ జీవితం లో అన్న గారితో ప్రయాణం ఎన్నటికీ మరువలేనిది. గత జన్మల సుకృతంగా భావిస్తాను. ఆ మహానుభావుడి జయంతి సందర్భంగా నా తదుపరి చిత్రాన్ని ప్రకటించడం ఆనందం గా ఉంది. నా కెరీర్ లో ఈ చిత్రం ప్రత్యేకం. మరింత కొత్తగా ప్రయత్నించబోతున్నాను. పూర్తి వివరాలు త్వరలో…” అని అన్నారు. ముగ్గురు డైరెక్టర్స్ తో ముగ్గురు హీరోయిన్స్ తో ఈ సినిమా ఉంటుందని చెబుతూ ఓ పోస్టర్ ను కూడా రాఘవేంద్రరావు విడుదల చేశారు. అయితే అప్పటినుండి ఈ సినిమాకు సంబందించిన అప్ డేట్ లేదు. దానితో ఈ సినిమా ఆగిపోయిందేమో అనుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అయితే మళ్ళీ దాదాపు ఈ సినిమాపై రాఘవేంద్ర రావు క్లారిటీ ఇచ్చారు. నిన్న ఎన్టీఆర్ జయంతి సందర్భంగా గత ఏడాది చేసిన ట్వీట్ ను జోడిస్తూ.. గత ఏడాది ఇదే రోజునా నా కొత్త సినిమా ముగ్గురు డైరెక్టర్స్ తో.. ముగ్గురు హీరోయిన్స్ తో సినిమా ను ప్రకటించాను. త్వరలోనే ఈ సినిమా తో ఎంటర్ టైన్ చేయడానికి వస్తాను.. ప్రామిస్ చేస్తున్న.. అని ట్వీట్ చేసాడు.

మరి ఇందులో హీరో, హీరోయిన్ ఎవరు.. ఒక్క హీరో హీరోయిన్ వుంటారా? లేక టైటిల్ కు తగ్గట్టు ముగ్గురు హీరోలు ముగ్గురు హీరోయిన్ లు ఉంటారా? అన్నది తెలియాలి. మిగిలిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు.


[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 − 10 =