[POLL]: బ‌ర్త్‌డే బాయ్ కార్తి నటించిన సినిమాల్లో మీకు నచ్చిన చిత్రమేది?

Which Among These Karthi's Film Impressed You The Most?

కార్తి.. పేరుకి తమిళ కథానాయకుడైనా తెలుగునాట కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కోలీవుడ్ స్టార్ సూర్య తమ్ముడిగా పరిచయమై అనతికాలంలోనే తనకంటూ ప్ర‌త్యేక అభిమానగ‌ణాన్ని సంపాదించుకున్నాడు కార్తి. త‌మిళంలో వైవిధ్య‌భ‌రిత‌మైన చిత్రాల‌కు చిరునామాగా నిలిచిన కార్తి.. ఆ సినిమాల‌తో తెలుగులోనూ తన మార్కెట్‌ను పెంచుకున్నాడు. అందుకే తమిళంలో కార్తి నటించిన దాదాపు ప్రతీ సినిమా తెలుగులోనూ అనువాదరూపంలో విడుదలవుతూ ఉంటుంది. అంతేకాదు.. ‘ఊపిరి’ వంటి స్ట్రెయిట్ ఫిల్మ్‌లో నటించి తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యాడు ఈ టాలెంటెడ్ స్టార్. తెలుగులో అనువాద‌మ‌య్యే త‌న ప్ర‌తీ సినిమాకి త‌నే డ‌బ్బింగ్ చెప్పుకోవ‌డం కార్తి ప్ర‌త్యేక‌త.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా.. నేడు (మే 25) కార్తి పుట్టినరోజు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ‘ది తెలుగు ఫిలిమ్ నగర్.కామ్’ ఓ ఆస‌క్తిక‌ర‌మైన పోల్ గేమ్‌ను నిర్వహిస్తోంది. ‘కార్తి న‌టించిన సినిమాల్లో మీ ఫేవ‌రెట్ మూవీ ఏది?’ అన్నదే ఈ పోల్ గేమ్ థీమ్. మీ ఓటు రూపంలో కార్తికి బ‌ర్త్‌డే విషెస్ తెలిపే అవ‌కాశ‌మిది. మరెందుకు ఆలస్యం.. పోల్ గేమ్‌లోకి ఎంటర్ అవుదాం.

[totalpoll id=”43688″]

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.