విజ‌య‌శాంతి ఇండ‌స్ట్రీ హిట్ ఫిల్మ్ `ఒసేయ్ రాముల‌మ్మ‌`కి 23 ఏళ్ళు

Vijayashanthi Blockbuster Movie Osey Ramulamma Completes 23 Years

ఫీమేల్ సెంట్రిక్ ఫిల్మ్స్ కి కేరాఫ్ అడ్ర‌స్ గా నిల‌చిన క‌థానాయిక‌ల్లో లేడీ సూప‌ర్ స్టార్ విజ‌య‌శాంతి ఒక‌రు. ఆమె న‌టించిన ప‌లు నాయికా ప్రాధాన్య చిత్రాలు బాక్సాఫీస్ వ‌ద్ద వ‌సూళ్ళ వ‌ర్షం కురిపించాయి. వాటిలో `ఒసేయ్ రాముల‌మ్మ‌`(1997) ఒక‌టి. ద‌ర్శ‌క‌ర‌త్న దాస‌రి నారాయ‌ణ రావు స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన‌ ఈ సినిమా.. అప్ప‌ట్లో ఇండ‌స్ట్రీ హిట్ గా నిల‌చింది. `ప్ర‌తిఘ‌ట‌న‌`(1985) త‌రువాత ఓ హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ ఇండ‌స్ట్రీ హిట్ గా నిల‌వ‌డం మ‌ళ్ళీ `ఒసేయ్ రాముల‌మ్మ‌`తోనే సాధ్య‌మైంది. ఈ రెండు సినిమాల్లోనూ విజ‌య‌శాంతి క‌థానాయిక కావ‌డం విశేషం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

దొర‌ల‌పై తిరుగుబాటు చేసిన ఓ మ‌హిళ క‌థ‌తో తెర‌కెక్కిన ఈ సినిమాలో దాస‌రి ఓ ముఖ్య భూమిక పోషించ‌గా.. సూప‌ర్ స్టార్ కృష్ణ అతిథి పాత్ర‌లో మెరిశారు. రామిరెడ్డి, శ‌కుంత‌ల‌, అశోక్ కుమార్ ఇత‌ర పాత్ర‌ల్లో న‌టించారు. `వందేమాత‌రం` శ్రీ‌నివాస్ అందించిన బాణీలు `ఒసేయ్ రాములమ్మ‌`కి ప్ర‌ధాన బ‌లంగా నిలిచాయి. టైటిల్ సాంగ్ తో పాటు `రామ‌స‌క్క‌ని త‌ల్లి`, `ల‌చ్చులో ల‌చ్చులా`, `ఓ చౌద‌రి గారూ`, `పుల్ల‌ల మంటివి`.. ఇలా దాదాపు ప్ర‌తీ పాట విశేషాద‌ర‌ణ పొందింది. ఉత్త‌మ న‌టి, ఉత్త‌మ సంగీత ద‌ర్శ‌కుడు విభాగాల్లో ఈ చిత్రానికి రెండు `నంది` పుర‌స్కారాలు ద‌క్కాయి. 1997 మార్చి 7న విడుద‌లైన `ఒసేయ్ రాముల‌మ్మ‌` నేటితో 23 ఏళ్ళ‌ను పూర్తిచేసుకుంటోంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.