“మరక్కార్ ” మూవీ టీమ్ కు ఆల్ ది బెస్ట్ – నాగార్జున

Akkineni Nagarjuna Wishes All The Best For Marakkar Movie Team

గోల్డెన్ గ్రూప్ సమర్పణలో ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్ పై ప్రియ దర్శన్ దర్శకత్వంలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా భారీ బడ్జెట్ తో, భారీ తారాగణం తో హిస్టారికల్ వార్ నేపథ్యంలో మలయాళ భాష లో రూపొందిన “మరక్కార్” లయన్ ఆఫ్ అరేబియన్ సీ మూవీ తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషలలో మార్చి 26 వ తేదీ రిలీజ్ కానుంది. సునీల్ శెట్టి, అర్జున్, ప్రభు, మంజు వారియర్, కీర్తి సురేష్ ప్రధాన పాత్రలలో రూపొందిన “మరక్కార్ ” మూవీలో ప్రణవ్ మోహన్ లాల్, కళ్యాణి ప్రియదర్శన్ అతిధి పాత్రలలో నటించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తెలుగు డబ్బింగ్ వెర్షన్ “మరక్కార్” అరేబియా సముద్ర సింహం మూవీ ట్రైలర్ ను మెగా స్టార్ చిరంజీవి రిలీజ్ చేశారు. తమిళ భాష లో హీరో సూర్య, కన్నడంలో యశ్, హిందీ లో అక్షయ్ కుమార్, మలయాళం లో మోహన్ లాల్ రిలీజ్ చేశారు. “మరక్కార్ ” మూవీ ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. “మరక్కార్ ” మూవీ ఆడియో మ్యాంగో మ్యూజిక్ ద్వారా రిలీజ్ కానుంది. ప్రపంచ వ్యాప్తం గా 50 దేశాలలో “మరక్కార్ ” మూవీ రిలీజ్ కానుందని సమాచారం. హీరో మోహన్ లాల్, దర్శకుడు ప్రియదర్శన్ &”మరక్కార్” లయన్ ఆఫ్ అరేబియన్ సీ మూవీ టీమ్ కు ఆల్ ది బెస్ట్ అంటూ కింగ్ నాగార్జున ట్వీట్ చేశారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × three =