ఫిమేల్ యాంకర్స్ ఎంతమంది ఉన్నా మనకు గుర్తొచ్చే మొట్టమొదటి పేరు సుమ.. అలానే మేల్ యాంకర్స్ ఎంత మంది ఉన్నా తన కామెడీ టైమింగ్ తో నవ్వించే ఒకే ఒక్క యాంకర్ ఎవరైనా ఉన్నారంటే అది ప్రదీప్ అని చెప్పొచ్చు. బుల్లితెరపై తన యాంకరింగ్ తో అలరించి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న ప్రదీప్ ఇప్పుడు వెండితెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకోడానికి వస్తున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
మున్నా దర్శకత్వంలో ప్రదీప్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ’30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’. ప్రదీప్ సినిమా కాబట్టి మొదటినుండి ఈ సినిమాకు హైప్ బాగానే వచ్చింది. దానికి తోడు సినిమా యూనిట్ భారీ ఎత్తున ప్రమోషన్లుకు ప్లాన్ చేస్తుంది. ఇప్పటికే చిత్రానికి సంబంధించిన పోస్టర్ రానా విడుదల చేయగా.. ఈ సినిమాలోని తొలి పాటను సూపర్ స్టార్ మహేశ్ బాబు విడుదల చేశారు. తాజాగా ఈ చిత్రంలోని రెండు లిరికల్ పాటలు మిల్క్ బ్యూటీ తమన్నా ట్విటర్ ద్వారా విడుదల చేశారు. ఇక ఇప్పటికే విడుదలైన తొలి సాంగ్ ‘నీలి నీలి ఆకాశం’ ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
ఇక తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు చిత్రయూనిట్. మార్చి 25 ఉగాది పండుగా రోజు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఈ సినిమాను రెండు పెద్ద ప్రొడక్షన్స్ కలిసి రిలీజ్ చేయడం. గీతా ఆర్ట్స్, యువి క్రియేషన్స్ ఇద్దరు కలిసి ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు.కాగా అమృతా అయ్యర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ను ఎస్వీ బాబు నిర్మిస్తుండగా.. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నాడు.





[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























