విభిన్నమైన చిత్రాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు విక్రమ్. కేవలం తమిళ్ లోనే కాదు తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకున్నాడు. అయితే ‘అపరిచితుడు’ తర్వాత విక్రమ్ హీరోగా చాలా సినిమాలు తెలుగులోకి అనువాదమైనా ఏ ఒక్కటీ పెద్దగా ఆకట్టుకోలేదు. కిందటేడాది వచ్చిన ‘స్కెచ్’, ‘సామీ 2’ కూడా పెద్దగా ప్రభావం చూపలేదు. అయితే, ఈసారి మాత్రం ఒక వెరైటీ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు విక్రమ్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో విక్రమ్ తన 58వ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. . ఈ సినిమాకు ‘కోబ్రా’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఇక తాజాగా మరో అప్ డేట్ ఇచ్చారు చిత్రయూనిట్. ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ ను రేపు సాయంత్రం 5 గంటలకు రిలీజ్ చేస్తున్నట్టు ఓ పోస్టర్ ద్వారా అధికారికం గాతెలిపారు.
కాగా శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాలో క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఎ.ఆర్.రెహమాన్ సంగీతం సమకూరుస్తున్నారు. 7 స్క్రీన్ స్టూడియో బ్యానర్‌పై లలిత్ కుమార్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: