`య‌న్.బి.కె 106`లో బాల‌కృష్ణ‌ చార్ట్ బ‌స్ట‌ర్ సాంగ్ రీమిక్స్?

Special Chartbuster Remix For NBK106,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,#NBK106,NBK 106,NBK 106 Movie Updates,NBK 106 Telugu Movie Latest News,NBK 106 Songs,NBK 106 Movie Songs,NBK 106 Telugu Movie Songs,NBK 106 Movie,NBK 106 Telugu Movie,Balakrishna,Boyapati Srinu

న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ కెరీర్ లో ప‌లు మ్యూజిక‌ల్ హిట్స్ ఉన్నాయి. వాటిలో `బంగారు బుల్లోడు` (1993) ఒక‌టి. ఇందులోని అన్ని పాట‌లూ అప్ప‌ట్లో విశేషాద‌ర‌ణ పొందాయి. మ‌రీ ముఖ్యంగా… `స్వాతిలో ముత్య‌మంత‌` పాట అయితే ఇప్ప‌టికీ ఎవ‌ర్ గ్రీన్. క‌ట్ చేస్తే.. ఇప్పుడీ చార్ట్ బ‌స్ట‌ర్ సాంగ్ ని `య‌న్.బి.కె. 106`కోసం రీమిక్స్ చేయ‌బోతున్నార‌ని ప్ర‌చారం సాగుతోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆ వివ‌రాల్లోకి వెళితే… బాల‌కృష్ణ‌, ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీ‌ను కాంబినేష‌న్ లో ఓ డివోష‌న‌ల్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ రాబోతున్న సంగ‌తి తెలిసిందే. మార్చి 2 నుండి రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌రుపుకోనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో శ్రియ‌, అంజ‌లి నాయిక‌లుగా న‌టించ‌నున్నారు. కాగా, హైద‌రాబాద్ లో జ‌రిగే తొలి షెడ్యూల్ లో బాల‌య్య‌, అంజ‌లిపై ఓ డ్యూయెట్ ని చిత్రీక‌రించ‌నున్నార‌ట‌. ఆ పాటే… `స్వాతిలో ముత్య‌మంత‌` రీమిక్స్ అని టాక్. థ‌మ‌న్ స్వ‌ర‌ప‌రిచిన ఈ గీతం సినిమా హైలైట్స్ లో ఒక‌టిగా నిలుస్తుంద‌ని వినిపిస్తోంది. ఏదేమైనా, దీనికి సంబంధించి అధికారిక స‌మాచారం రావాల్సి ఉంది.

మ‌రోవైపు, `అల్ల‌రి` న‌రేష్ హీరోగా న‌టిస్తున్న `బంగారు బుల్లోడు`లోనూ `స్వాతిలో ముత్య‌మంత‌` పాట‌ని రీమిక్స్ చేశారు. చాన్నాళ్ళ క్రిత‌మే ఈ పాట తాలూకు ప్రోమోని రిలీజ్ చేశారు కూడా. అయితే, గ‌తేడాది దీపావ‌ళికి రావాల్సిన ఈ సినిమాకి సంబంధించి ఈ మ‌ధ్య‌ ఎలాంటి అప్ డేట్స్ లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 3 =