`బాహుబలి` చిత్రాలతో కథానాయకుడిగా ఆకాశమంత ఇమేజ్ ని మూటగట్టుకున్నాడు `డార్లింగ్` ప్రభాస్. ఆ ఇమేజ్ తగ్గట్టుగానే సినిమాలు చేసుకుపోతున్న ఈ ఉప్పలపాటి వారి హ్యాండ్సమ్ హీరో… ప్రస్తుతం తన 20వ చిత్రంతో బిజీగా ఉన్నాడు. సొంత నిర్మాణ సంస్థలు గోపీకృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీ… శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా, ఈ చిత్రాన్ని `బాహుబలి – ది కంక్లూజన్` రిలీజ్ డేట్ అయిన ఏప్రిల్ 28ని టార్గెట్ చేసుకుని 2020 వేసవిలో విడుదల చేయబోతున్నారని ఆ మధ్య ప్రచారం సాగింది. అయితే బయ్యర్స్ వెర్షన్ మాత్రం మరో రకంగా ఉంది. అదేంటంటే… ఈ ఏడాది దసరా సీజన్ లోనే అంటే అక్టోబర్ 16న ఈ క్రేజీ ప్రాజెక్ట్ సందడి చేస్తుందట. ఏదేమైనా, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
`జిల్` రాధాకృష్ణ రూపొందిస్తున్న `ప్రభాస్ 20`లో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: