తెలుగు, తమిళ భాషల్లో సంచలన విజయం సాధించిన చిత్రం `ఖైదీ` (2019). కోలీవుడ్ స్టార్ కార్తి టైటిల్ రోల్ లో నటించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ని లోకేష్ కనకరాజ్ తెరకెక్కించాడు. కథానాయిక, పాటలు… ఇలా ఫక్తు వాణిజ్య సూత్రాలకు దూరంగా, విభిన్న తరహాలో రూపొందిన ఈ సినిమా… ఇప్పుడు హిందీలో రీమేక్ కానుంది. మాతృక నిర్మాత యస్. ఆర్. ప్రభుతో కలసి రిలయన్స్ ఎంటర్ టైన్ మెంట్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్




ఇదిలా ఉంటే… ఆ మధ్య బాలీవుడ్ కండల వీరుడు హృతిక్ రోషన్ ఈ రీమేక్ లో నటించబోతున్నట్లు ప్రచారం జరిగింది. లేటెస్ట్ బజ్ ఏంటంటే.. ప్రముఖ బాలీవుడ్ నటుడు, రాజమౌళి బడా మల్టీస్టారర్ `ఆర్ ఆర్ ఆర్`లో కీలక పాత్ర పోషిస్తున్న అజయ్ దేవగణ్ `ఖైదీ` రీమేక్ లో నటించబోతున్నట్లు బీటౌన్ టాక్. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది. కాగా, ఈ ఏడాది చివరలో `ఖైదీ` హిందీ రీమేక్ పట్టాలెక్కనుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: