బ్లాక్ బస్టర్ కాంబినేషన్ నటసింహ నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కలయికలో ఓ డివోషనల్ ఎంటర్ టైనర్ రాబోతున్న సంగతి తెలిసిందే. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మాణంలో రూపొందనున్న ఈ చిత్రానికి యువ సంగీత సంచలనం థమన్ బాణీలు అందిస్తున్నాడు. బాలయ్యకి జోడీగా శ్రియ, అంజలి నటించబోతున్నట్లు ప్రచారం సాగుతోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్




ఇదిలా ఉంటే… ఈ సినిమాకి సంబంధించిన తొలి షెడ్యూల్ మార్చి 2న ప్రారంభం కానుందట. హైదరాబాద్ లో జరిగే ఈ షెడ్యూల్ లో బాలకృష్ణ బృందంపై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారని సమాచారం. ఆపై వారణాసి నేపథ్యంలో తదుపరి షెడ్యూల్ ఉంటుందని వినికిడి. కాగా, జూలై నెలాఖరులో ఈ క్రేజీ ప్రాజెక్ట్ థియేటర్లలో సందడి చేయనుంది.
`సింహా`, `లెజెండ్` వంటి సెన్సేషనల్ మూవీస్ తరువాత బాలయ్య, బోయపాటి కాంబోలో వస్తున్న ఈ చిత్రం… బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























