ప్రస్తుతం వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెలుగులో పింక్ చిత్రాన్ని రీమేక్ చేస్తున్నసంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది.ఈ సినిమాను మే 15వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు ముందే ప్రకటించారు కూడా. ఇక ఈ సినిమాతో పాటుగా పవన్ క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కనున్న పీరియాడిక్ డ్రామా సినిమా చేయనున్న సంగతి విదితమే. పింక్ షూటింగ్ వచ్చే నెలలో ముగుస్తుండటంతో.. ఆ సినిమా తర్వాత వెంటనే క్రిష్ సినిమాలో జాయిన్ అవ్వనున్నాడు. ఇక క్రిష్ సినిమా తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో.. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లో మరో సినిమా చేయనున్నాడు. క్రిష్ సినిమా తర్వాత వెంటనే హరీష్ శంకర్ సినిమా చేయనున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఇప్పుడు మరో ఇంటరెస్టింగ్ న్యూస్ ఒకటి వినిపిస్తుంది. ఈ సినిమాల తర్వాత పవన్-పూరీ కాంబినేషన్ లో ఒక సినిమా రాబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం విజయ్ దేవరకొండతో ఫైటర్ సినిమాతో బిజీ గా ఉన్న పూరీ ఆ సినిమా అయిపోయిన వెంటనే పవన్ కు కథ చెప్పి తన సొంత బ్యానర్ పూరీ కనెక్ట్స్ అండ్ టూరింగ్ టాకీస్ లో ఈ సినిమా తీయాలన్న ప్లాన్ లో వున్నాడట. పేట్రియాటిక్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా వుండబోతున్నట్టు కూడా అప్పుడే ఊహాగానాలు అందుకున్నాయి. మరి దీనిపై క్లారిటీ రావాలంటే మాత్రం అధికారిక ప్రకటన వచ్చేంత వరకూ ఆగాల్సిందే.




కాగా పూరీ మొదటి సినిమా బద్రి పవన్ తో చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఎంత బ్లాక్ బస్టర్ అయిందో కూడా ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ తర్వాత ‘కెమెరా మెన్ గంగతో రాంబాబు’ సినిమా తీశారు. ఇప్పుడు మూడోసారి ముచ్చటగా రాబోతున్నారు.. చూద్దాం మరి
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: