కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Mani Sharma Latest News

ట్యాగ్ · 7 కథనాలు

సినిమా వార్తలు

'ఆచార్య' ఆల్బమ్ పై మణిశర్మ క్రేజీ అప్ డేట్..!

టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ, మెగా స్టార్ చిరంజీవి కాంబినేషన్ లో ఆచార్య సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా నుండి టైటిల్ తప్పా ఇంత వరకూ ఎలాంటి అప్ డేట్ వచ్చింది లేదు. అప్ డేట్స్ ఇచ్చే లోపే కరోనా వచ్చి పడటంతో షూటింగ్ కు కూడా బ్రేక్ చెప్పాల్సి వచ్చింది. మొదటి నుండి ఈ సినిమాలు కాస్త ఇబ్బందులు తలెత్తుతున్నా కొంత వరకూ షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ఈ నాలుగు నెలలు కనుక ఇలాంటి పరిస్థితులు లేకుండా ఉండి ఉంటేదాదాపు షూటింగ్ ముగిసేదే. ఎలాగూ షూటింగ్ లు కూడా లేవు అప్ డేట్స్ కూడా లేకుండా పోయాయి.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

నితిన్ ‘పవర్ పేట్’కు మణిశర్మ స్వరాలు?

యువ కథానాయకుడు నితిన్, దర్శకుడు కృష్ణచైతన్య కాంబినేషన్‌లో ‘పవర్ పేట్’ అనే సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. తమిళనాట ఘనవిజయం సాధించిన ‘వడ చెన్నై’(2018) తరహాలో ఈ చిత్రం రూపొందనుంద‌ని టాక్. అంతేకాదు.. రెండు భాగాలుగా ఈ చిత్రం తెర‌కెక్క‌నుంద‌ని ప్ర‌చారం సాగుతోంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో నితిన్‌కు జోడిగా కీర్తి సురేష్ నటించనుండగా విలన్‌గా రావు రమేష్ దర్శనమివ్వనున్నాడని తెలిసింది. ఇదిలా ఉంటే.. ఈ చిత్రానికి “మెలోడీ బ్రహ్మ” మణిశర్మ బాణీలు సమకూరుస్తున్నట్టు సమాచారం.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

`రెడ్`కి మ‌ణిశ‌ర్మ సెంటిమెంట్

`ఇస్మార్ట్ శంకర్`తో `ఇస్మార్ట్`గా బౌన్స్ బ్యాక్ అయ్యాడు మెలోడీ బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ‌. ప్ర‌స్తుతం `మెగాస్టార్ 152`తో పాటు `నార‌ప్ప‌`, `రెడ్`... ఇలా ప‌లు క్రేజీ ప్రాజెక్ట్ ల‌కు బాణీలు అందిస్తున్నాడీ వెట‌ర‌న్ కంపోజ‌ర్. కాగా, వీటిలో `రెడ్` ముందుగా రిలీజ్ కానుంది. దాదాపు చిత్రీక‌ర‌ణ పూర్తిచేసుకున్న ఈ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్.. ఏప్రిల్ 9న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Team TFNవాట్సాప్
Melody Brahma Mani Sharma - Mahesh Babu Combination To Spell Magic Once Again
సినిమా వార్తలు

మ‌హేష్ బాబు చిత్రానికి మ‌ణిశ‌ర్మ బాణీలు?

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబుకి అచ్చొచ్చిన స్వ‌ర‌క‌ర్త‌ల్లో మెలోడీ బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మదే అగ్ర‌శ్రేణి స్థానం. క‌థానాయ‌కుడిగా మ‌హేష్ తొలి చిత్రం `రాజ‌కుమారుడు`తో మొద‌లుకుని... మ‌హేష్ లో న‌టుడ్ని ప‌రిపూర్ణంగా వెలికి తీసిన `మురారి`, తొలి బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిల‌చిన `ఒక్క‌డు`, `వ‌న్ అండ్ ఓన్లీ` ఇండ‌స్ట్రీ హిట్ అయిన‌ `పోకిరి` వ‌ర‌కు... ఇలా ప‌లు ద‌శ‌ల్లో మ‌ణిశ‌ర్మ సంగీతం ముఖ్య భూమిక పోషించింది. `ఖ‌లేజా` (2010) త‌రువాత మ‌ళ్ళీ ఈ కాంబినేష‌న్ లో మ‌ళ్ళీ పాట‌లు సంద‌డి చేయ‌నేలేదు. కాక‌పోతే, ఆ మ‌ధ్య `సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు` (2013)కి నేప‌థ్య సంగీత‌మందించాడు మ‌ణి.

Team TFNవాట్సాప్
స్పెషల్

మళ్ళీ ఫామ్ లోకి వచ్చిన మెలోడీ బ్రహ్మ

మెలోడీ బ్రహ్మ అంటే సంగీత ప్రియులకు స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు.. ఎన్నో సూపర్ హిట్ పాటలను అందించాడు. ఇళయరాజా, ఎం.ఎం.కీరవాణి, రాజ్-కోటిల దగ్గర పనిచేసిన ఆయన "సూపర్ హీరోస్" చిత్రంతో సంగీత దర్శకునిగా కెరియర్ ప్రారంభించి ఇప్పటి వరకు 200 చిత్రాలకి పైగా సంగీతాన్నందించారు. కెరీర్ మొదట మణిశర్మ బిజీ బిజీ గా సూపర్ హిట్స్ తో అందరు అగ్ర తారల సినిమాలకు మ్యూజిక్ అందించి.. అగ్రతారల మ్యూజిక్ డైరెక్టర్ గా ఎదిగాడు. ఎన్నో మెలోడీ సాంగ్స్ అందించారు. ఇరవై రెండేళ్ల సినీ ప్రస్థానంలో ఎన్నో మరపురాని విజయాల్ని సొంతం చేసుకున్నారాయన.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

మెలోడీ బ్ర‌హ్మ ఖాతాలో 'అసుర‌న్' రీమేక్‌?

కోలీవుడ్ బ్లాక్‌బ‌స్ట‌ర్ `అసుర‌న్`... తెలుగులో రీమేక్ అవుతున్న సంగ‌తి తెలిసిందే. విక్ట‌రీ వెంక‌టేష్ క‌థానాయ‌కుడిగా న‌టించ‌నున్న ఈ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ లో అనుష్క నాయిక‌గా క‌న్‌ఫ‌ర్మ్ అయింద‌ని టాక్‌. డి.సురేష్ బాబు, క‌లైపులి ఎస్.థాను సంయుక్తంగా నిర్మించ‌నున్న ఈ చిత్రానికి శ్రీ‌కాంత్ అడ్డాల ద‌ర్శ‌కుడిగా ఎంపిక‌య్యాడ‌ని ప్ర‌చారం సాగుతోంది. ఇదిలా ఉంటే... నేప‌థ్య సంగీతానికి ఎంతో ప్రాధాన్య‌మున్న ఈ చిత్రానికి మెలోడీ బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ సంగీత ద‌ర్శ‌కుడిగా ఫిక్స్ అయ్యాడ‌ట‌. త్వ‌ర‌లోనే మ‌ణి ఎంట్రీపై ఫుల్ క్లారిటీ వ‌స్తుంది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

చిరుతో మ‌రోసారి మ‌ణిశ‌ర్మ‌?

మెగాస్టార్ చిరంజీవికి అచ్చొచ్చిన స్వ‌ర‌క‌ర్త‌లో మెలోడీ బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ ఒక‌రు. వీరిద్ద‌రి క‌ల‌యిక‌లో వ‌చ్చిన ప‌లు చిత్రాలు ఘ‌న‌విజ‌యం సాధించాయి. `బావ‌గారూ బాగున్నారా?`, `చూడాల‌ని వుంది`(1998), ఇద్ద‌రు మిత్రులు (1999), అన్న‌య్య (2000), మృగ‌రాజు (2001), ఇంద్ర (2002), ఠాగూర్ (2003), అంజి (2004), జై చిరంజీవ‌! (2005), స్టాలిన్ (2006)... ఇలా వ‌రుస‌గా తొమ్మిదేళ్ళ పాటు ఈ ఇద్ద‌రి క‌ల‌యిక‌లో ప‌లు మ్యూజిక‌ల్ హిట్స్ వచ్చాయి.

Team TFNవాట్సాప్

షేర్