హెబ్బా ప‌టేల్.. ఫెస్టివల్ స్పెష‌ల్

Hebah Patel Festival Special Movies

అందం, అభిన‌యం రెండూ మెండుగా ఉన్న ఈ త‌రం క‌థానాయిక‌ల్లో హెబ్బా ప‌టేల్ ఒక‌రు. `అలా ఎలా`, `కుమారి 21 ఎఫ్`, `ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా` వంటి విజ‌య‌వంత‌మైన చిత్రాల్లో సంద‌డి చేసిన ఈ టాలెంటెడ్ బ్యూటీ… ఆ త‌రువాత మాత్రం ఆ స్థాయి స‌క్సెస్ ఫుల్ మూవీస్ ని త‌న కిట్టీలో వేసుకోలేక‌పోయింది. ఈ నేప‌థ్యంలో… త‌క్కువ గ్యాప్ లోనే రెండు చిత్రాల‌తో ప‌ల‌క‌రించ‌బోతోంది హెబ్బా. అయితే, ఈ రెండు సినిమాల్లోనూ హెబ్బా నాయిక‌గా కాకుండా క‌థ‌ను కీల‌క మ‌లుపు తిప్పే పాత్ర‌లు చేసింది. విశేష‌మేమిటంటే… ఈ రెండు చిత్రాలు కూడా పండ‌గ‌ల‌ను ల‌క్ష్యంగా చేసుకుని రాబోతున్నాయి. ఆ చిత్రాలే.. `భీష్మ‌`, `ఒరేయ్ బుజ్జిగా`.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[custom_ad]

నితిన్, ర‌ష్మిక జంట‌గా న‌టించిన `భీష్మ‌` మ‌హాశివ‌రాత్రి కానుక‌గా ఈ నెల 21న రిలీజ్ కానుండ‌గా.. రాజ్ త‌రుణ్, మాళ‌వికా నాయ‌ర్ జోడీగా న‌టించిన `ఒరేయ్ బుజ్జిగా` ఉగాది కానుక‌గా మార్చి 25న విడుద‌ల కానుంది. మ‌రి… ఫెస్టివ‌ల్ స్పెష‌ల్ గా రాబోతున్న‌ ఆ యా చిత్రాలు హెబ్బాకి ఎలాంటి ఫ‌లితాన్ని అందిస్తాయో చూడాలి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × five =