
సినిమా వార్తలు
ట్యాగ్ · 2 కథనాలు


తమిళ చిత్ర దర్శకుడు శంకర్ ఎస్ దర్శకత్వంలో ప్రభుదేవా హీరోగా తెరకెక్కిన "కాదలన్ " తమిళ మూవీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. "కాదలన్ " తమిళ మూవీ తెలుగు డబ్బింగ్ వెర్షన్ "ప్రేమికుడు "ఘనవిజయం సాధించింది. ఏ ఆర్ రెహమాన్ స్వరకల్పనలో సాంగ్స్ , ప్రభుదేవా డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రభుదేవా ఇప్పుడు "మిస్టర్ ప్రేమికుడు" మూవీ తో ప్రేక్షకులను అలరించనున్నారు.
భరతన్ పిక్చర్స్ బ్యానర్ పై ఆధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో ప్రభుదేవా హీరోగా మిస్టరీ థ్రిల్లర్ "బఘీర"తమిళ మూవీ రూపొందుతుంది. ప్రభుదేవా 55 వ మూవీ గా రూపొందుతున్న ఈ మూవీ లో అమైరా దస్తూర్ కథానాయిక. గణేశన్ శంకర్ సంగీతం అందించిన "బఘీర" మూవీ 70 శాతం షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకుందని సమాచారం.