బాహుబలి సినిమా తర్వాత అంత రేంజ్ లో క్రేజ్ తెచ్చుకున్న సినిమా కేజిఎఫ్ అని చెప్పొచ్చు. ప్రశాంత్ నీల్ డైరక్షన్ లో కన్నడ రాకింగ్ స్టార్ యశ్ హీరోగా వచ్చిన కె.జి.ఎఫ్ చాప్టర్ 1 ఎంత పెద్ద సెన్సేషనల్ హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కన్నడలోనే కాదు.. తెలుగు, తమిళ, హింది భాషల్లో ఈ మూవీ అద్భుతమైన విజయాన్ని సాధించింది. ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద దాదాపు 250 కోట్లు వసూలు చేసి రికార్డులు సృష్టించింది. ఇప్పుడు ఈ చిత్ర రెండోవ భాగాన్ని చిత్రీకరిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ చిత్రంలో బాలీవుడ్, టాలీవుడ్ నటులు కూడా నటిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ సినిమాలో టాలీవుడ్ లో తన డైలాగ్ డెలివరి తో, విలక్షణమైన నటనతో ప్రేక్షకుల మనసు దోచుకొని ఇండస్ట్రీ లో అగ్రనటులుగా తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరుచుకున్న నటుడురావు రమేష్. ఏలాంటి పాత్ర చేసినా ఆ పాత్రలో ఒదిగిపోతారనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఇప్పుడు కేజిఎఫ్ చాప్టర్ 2 లో రావు రమేష్ కూడా నటించబోతున్నారు. ఈ విషయాన్నీ దర్శకుడు ప్రశాంత్ నీల్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలియజేసారు.
Welcome on board Rao Ramesh sir.
We will leave it to the audience to keep guessing on this one, till they see you on the big screen.
Thank you for being apart of #KGFChapter2 pic.twitter.com/fWteQ5YnHm— Prashanth Neel (@prashanth_neel) February 10, 2020
[custom_ad]



కాగా ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. హోంబలే ఫిలింస్, ఎక్సెల్ మూవీస్, వారాహి చలన చిత్రం బ్యానర్స్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. షూటింగ్ ను త్వరలోనే పూర్తి చేసి జులై 30 న రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. మరి చూద్దాం ఇది ఎంత వరకూ వర్క్ అవుట్ అవుతుందో.మరి చాప్టర్ 1 సూపర్ హిట్ అవడంతో కె.జి.ఎఫ్ చాప్టర్ 2 మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా ఎన్ని సంచలనాలు క్రియేట్ చేస్తుందో చుద్దాం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























