సౌత్ ఇండియా ఫిల్మ్ ఇండస్ట్రీ లో ఒక అన్యోన్య జంటగా మహేష్ బాబు, నమ్రత పేరుపొందారు. 2005 సంవత్సరం ఫిబ్రవరి 10వ తేదీ వివాహం జరిగిన ఈ జంట ఈ రోజు తమ 15వ పెళ్ళి రోజు ను ఆనందంగా జరుపుకుంటున్నారు. ఈ స్పెషల్ డే సందర్భంగా మహేష్ బాబు , నమ్రత తమ అపురూప ఫోటోలను అభిమానులతో సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్నారు. వీరిద్దరి ప్రేమకథ ఒక సినిమా కథ ను తలపిస్తుందనడంలో సందేహం లేదు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
2000 సంవత్సరంలో బి గోపాల్ దర్శకత్వంలో మహేష్ బాబు, నమ్రత జంటగా “వంశీ” మూవీ రూపొందిన విషయం తెలిసిందే. ఆ మూవీ ముహూర్తం రోజున లవ్ ఎట్ ఫస్ట్ సైట్ తో వారి ప్రేమ మొదలయ్యింది. ఇద్దరూ ఆ మూవీ సెట్స్ లో ఆనందంగా టైమ్ స్పెండ్ చేశారు. “వంశీ” మూవీషూటింగ్ కంప్లీట్ అయ్యేసరికి వారిద్దరూ డేటింగ్ లో ఉన్నారు. మహేష్ బాబు కంటే నమ్రత వయసులో కాస్త పెద్దయినా వారి
ప్రేమకు అడ్డంకి కాలేదు. 4 సంవత్సరాల పాటు డేటింగ్ లో ఉన్న మహేష్ బాబు, నమ్రత వారి లవ్ ఎఫైర్ ను మీడియా కు తెలియకుండా మేనేజ్ చేశారు. మహేష్ బాబు సిస్టర్ వారిద్దరి ప్రేమ గురించి పేరెంట్స్ కు తెలుపగా వారి వివాహం జరిగింది. వివాహానంతరం నమ్రత నటనకు గుడ్ బై చెప్పారు. ఈ జంటకు 2006 సంవత్సరంలో గౌతమ్, 2012 సంవత్సరంలో సితార జన్మించారు.
[custom_ad]
మ్యారేజ్ డే సందర్భంగా మహేష్ బాబు మాట్లాడుతూ … నమ్రత చాలా సపోర్టివ్ అని , కొన్నిసార్లు తాను కొన్ని విషయాలలో డౌట్ పడుతుండటంతో నమ్రత బ్యాలెన్స్ చేస్తారని , నమ్రత తన బ్యాలెన్స్ ఫ్యాక్టర్ అని తెలిపారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: