సెన్సార్ పూర్తిచేసుకున్న ‘డిస్కో రాజా’

వీఐ ఆనంద్ దర్శకత్వంలో రవితేజ హీరోగా సైంటిఫిక్‌ థ్రిల్లర్‌ ‘డిస్కోరాజా’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మరో నాలుగు రోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో కూడా జోరు పెంచింది చిత్రయూనిట్. ఇప్పటికే టీజర్ తో అంచనాలు పెంచేసిన రవితేజ…నిన్న రిలీజ్ చేసిన ట్రయిలర్ తో మరింత పెంచేసాడు. తాజాగా సెన్సారు కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డువారు ఈ సినిమాకి U\A సర్టిఫికేట్ ను అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[custom_ad]

ఇక ఈ సినిమాలో మాస్ మహారాజ రవితేజ సరసన పాయల్ రాజ్ పుత్, నాభ నటేష్, తాన్యా హోప్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇంకా ఈ సినిమాలో సునీల్, రామ్‌కీ, బాబీ సింహా, వెన్నెల కిశోర్, సత్య ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ప్రముఖ నిర్మాత రామ్ తళ్లూరి ఎస్ ఆర్ టి ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు… ఎస్.ఎస్.థమన్ సంగీతం అందిస్తున్నారు. జనవరి 24వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానుంది. సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో రవితేజ తండ్రీకొడుకులుగా డ్యూయెల్ రోల్‌లో దర్శనమివ్వనున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 + eighteen =