అల్లరి సినిమాతో తెలుగు తెరకు పరిచయమై ఆ సినిమా పేరునే ఇంటి పేరుగా మార్చుకున్న హీరో నరేష్. తన కెరీర్ ప్రారంభంలో వరుస హిట్లతో దూసుకుపోయిన అల్లరి నరేష్ కు గత కొంతకాలంగా సరైన హిట్ పడలేదు. దానితో కాస్త వెనుకపడ్డాడు. ఇక ఇటీవల మహర్షి సినిమాలో ఒక కీలక పాత్రలో నటించాడు. మహర్షి సినిమాలో మహేష్ బాబు కు ఫ్రెండ్ గా చేయగా ఆ పాత్రకు మంచి పేరు వచ్చింది. ఇక అల్లరి నరేష్ మరో కొత్త సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. నరేష్ విజయ్ కనకమేడల అనే కొత్త దర్శకుడితో ఓ కాన్సెప్ట్-ఓరియెంటెడ్ సినిమాలో నరేష్ నటించనున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
[custom_ad]
ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా అప్ డేట్ ను ఇచ్చారు చిత్రయూనిట్. ఈ నెల 20వ తేదీన హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో ఈ చిత్రం ప్రారంభోత్సవం జరుగనుందని చిత్రబృందం ప్రకటించింది. ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను కూడా విడుదల చేసింది. ఫస్ట్‌లుక్‌లో మొహం నిండా గాయాలతో అల్లరి నరేష్ డిఫరెంట్ గా కనిపిస్తున్నాడు. మొత్తానికి ఈసారి డిఫరెంట్ కాన్సెప్ట్ తోనే వస్తున్నట్టు కనిపిస్తుంది నరేష్. చూద్దాం మరి ఏం జరుగుతుందో..
On this 20th of 2020…. a new beginning…let’s do this! @SV2Ent @Vijaykanakamed2 @varusarath @SatishVegesna @ChotaKPrasad @brahmakadali @RajeshDanda_ @UrsVamsiShekar pic.twitter.com/f3DjOfVtKg
— Allari Naresh (@allarinaresh) January 18, 2020
[custom_ad]
కాగా ఎస్వీ 2 ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సతీష్ వేగేశ్న ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శ్రీ చరణ్ పాకల సంగీతమందిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు సోమవారం వెల్లడించనున్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: