బాల‌కృష్ణ `న‌ర‌సింహ‌నాయుడు`కి 19 ఏళ్ళు

Balakrishna Narasimha Naidu Completes 19 Years

న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ కెరీర్ లో ప‌లు ఇండ‌స్ట్రీ హిట్స్ ఉన్నాయి. వాటిలో `న‌ర‌సింహ‌నాయుడు`(2001) ఒక‌టి. `లారీ డ్రైవ‌ర్`, `రౌడీ ఇన్స్ పెక్ట‌ర్`, `స‌మ‌ర‌సింహారెడ్డి` వంటి ఘ‌న‌విజ‌యాల త‌రువాత బి.గోపాల్ ద‌ర్శ‌క‌త్వంలో బాల‌య్య న‌టించిన ఈ సినిమా.. గ‌త రికార్డుల‌ను భూస్థాపితం చేసి స‌రికొత్త చ‌రిత్ర సృష్టించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[custom_ad]

`న‌ర‌సింహ‌నాయుడు`కి ముందు ఇండ‌స్ట్రీ హిట్ అయిన `స‌మ‌రసింహారెడ్డి`కి ప‌నిచేసిన చిత్ర‌బృంద‌మే (బాల‌కృష్ణ – హీరో, సిమ్రాన్ – హీరోయిన్, మ‌ణిశ‌ర్మ – సంగీతం, బి.గోపాల్ – ద‌ర్శ‌క‌త్వం).. ఈ `ఇండ‌స్ట్రీ హిట్` ఫిల్మ్ కి కూడా ప‌నిచేయ‌డం విశేషం. శ్రీ వెంక‌ట ర‌మ‌ణ ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై ఎమ్. వి. ముర‌ళీ కృష్ణ నిర్మించిన ఈ సినిమాతో.. `ఉత్త‌మ న‌టుడు`గా తొలి `నంది` పుర‌స్కారాన్ని అందుకున్నారు బాల‌య్య‌. 2001 జ‌న‌వ‌రి 11న విడుద‌లై బాక్సాఫీస్ ని షేక్ చేసిన‌ `న‌ర‌సింహ‌నాయుడు`… నేటితో 19 వ‌సంతాల‌ను పూర్తిచేసుకుని 20లోకి అడుగుపెడుతోంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 4 =