మెగా కుటుంబం మెగా అభిమానులకు ఎప్పుడూ తోడుగానే ఉంటుంది. అందుకే మెగా ఫ్యామిలీ పై అభిమానుల్లో అంత అభిమానం ఉంటుంది. మెగా ఫ్యామిలీ అభిమానుల గురించి అయితే కొత్తగా చెప్పాల్సిన పని లేదు హీరోల కోసం ప్రాణమిచ్చే అభిమానులు కోట్లలో ఉన్నారు. తెలుగు సినీ పరిశ్రమలో ఆ ఫ్యామిలీపై వుండే అభిమానం సెపరేటు. అలాగే మెగా ఫ్యామిలీ కూడా అభిమానులంటే అంతే ప్రాణంగా వుంటారు. వారికి ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా ముందుంటారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ నేపథ్యంలోనే.. మెగా అభిమానులకు జీవిత బీమా చేయించాలని సంకల్పించింది ‘అఖిల భారత చిరంజీవి యువత’. అభిమానులకు ఏదైనా ప్రమాదం సంభవించి ఊహించని ఘటన జరిగితే… వారి కుటుంబాలకు అండగా ఉండేందుకు అభిమానుల పేరు మీద ఇన్స్యూరెన్స్ చేయించాలని నిర్ణయించింది. మన కుటుంబసభ్యులకు ఆసరాగా ఉండేందుకు ఇది ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా అఖిల భారత చిరంజీవి యువత సంస్థ ప్రకటించింది. మెగా అభిమానులందరూ వారి వివరాలను [email protected] కు మెయిల్ చేయాలని కోరింది.
మరి అభిమానులను అక్కున చేర్చుకుని, వారి కుటుంబాలకు అండగా నిలబడటం గొప్ప విషయమే. మిగిలిన హీరోల అభిమానులు కూడా తమ అభిమానుల కోసం ఇలాంటి కార్యక్రమాలు చేపడితే.. హీరోలతో పాటు అభిమానులు కూడా బావుంటారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:






























