సిద్దార్ధ్ ‘టక్కర్’ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్

Latest Telugu Movies News, Siddharth Takkar Movie First Look Poster Out Now, Takkar First Look, Takkar Movie Official Look, Takkar Movie Updates, Takkar Telugu Movie First Look, Takkar Telugu Movie Latest News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Movie Updates

‘బోయ్స్’, ‘బొమ్మరిల్లు’, ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’,’ఓయ్’ ఇలా తన సినిమాలతో ప్రేక్షకులను మెప్పించి తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్‌ను ఏర్పరుచుకున్నాడు సిద్ధార్థ్. ఇక ప్రస్తుతం వున్న పోటీ వాతావరణంలో కాస్త వెనకబడిపోయాడు. అప్పుడప్పుడు ఒక్కో సినిమాతో ప్రేక్షకులను పలకరిస్తున్నాడు. ఇటీవలే ‘వదలడు’ సినిమాతో వచ్చిన సిద్దార్ధ్ ఇప్పుడు తాజాగా మరో డిఫరెంట్ స్టోరీతో వస్తున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కార్తిక్ జి క్రిష్ దర్శకత్వంలో సిద్దార్ధ్, దివ్యాంశ కౌశిక్ హీరో హీరోయిన్లుగా వస్తున్న సినిమా ‘టక్కర్’. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇటీవలే ఈ సినిమా టైటిల్ పోస్టర్ ను రిలీజ్ చేసిన చిత్రయూనిట్ ఇప్పుడు తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేసింది. తమిళ్ లో స్టార్ హీరో విశాల్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయగా.. తెలుగులో నితిన్ రిలీజ్ చేసాడు.

ఇంకా ఈ సినిమాలో అభిమన్యు సింగ్, యోగిబాబు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ప్యాషన్ స్టూడియోస్ బ్యానర్‌పై సుధన్ సుందరం, జయరాం నిర్మిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదల చేయనున్నారు. నివాస్ కె ప్రసన్న ఈ సినిమాకు సంగీతం సమకూరుస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 − 4 =