పాన్ – ఇండియా మూవీగా చిరు – కొర‌టాల చిత్రం?

Chiru - Koratala New Movie Attracts Pan India Recognition

మెగాస్టార్ చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్ట్ `సైరా న‌ర‌సింహారెడ్డి` పాన్-ఇండియా ఫిల్మ్ గా రిలీజైన సంగ‌తి తెలిసిందే. మ‌హాత్మ గాంధీ 150వ జ‌యంతి సంద‌ర్భంగా ఈ అక్టోబ‌ర్ 2న‌ తెలుగుతో పాటు త‌మిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో `సైరా` విడుద‌లైంది. క‌ట్ చేస్తే… ఇప్పుడ‌దే బాట‌లో చిరు నెక్స్ట్ ఫిల్మ్ కూడా ప‌లు భాష‌ల్లో తెర‌పైకి రానుందని స‌మాచారం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆ వివ‌రాల్లోకి వెళితే…. మెగాస్టార్ చిరంజీవి, స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ కాంబినేష‌న్ లో ఓ మెసేజ్ ఓరియెంటెడ్ ఫిల్మ్ రాబోతున్న సంగ‌తి తెలిసిందే. జ‌న‌వ‌రి నుంచి ప‌ట్టాలెక్క‌నున్న ఈ చిత్రంలో త్రిష క‌థానాయిక‌గా న‌టించ‌నుంది. రామ్ చ‌ర‌ణ్, నిరంజ‌న్ రెడ్డి సంయుక్తంగా నిర్మించ‌నున్న ఈ సినిమాని పాన్-ఇండియా ఫిల్మ్ గా రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నార‌ట‌. అందుకు త‌గ్గ‌ట్టే ఆర్టిస్టుల‌ను కూడా ఎంపిక చేస్తున్నార‌ని వినికిడి. మ‌రి… ఈ వార్త‌ల్లో ఎంత నిజ‌ముందో తెలియాలంటే కొన్నాళ్ళు ఆగాల్సిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × four =