బాల‌కృష్ణ‌, బోయ‌పాటి చిత్రానికి థ‌మ‌న్ బాణీలు?

Thaman Composes Music For Balakrishna – Boyapati New Film,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Movie Updates,Music Director Thaman Upcoming Movies,Thaman Next Film Updates,Thaman New Movie Updates,Thaman Latest Movie Details

ఆ మ‌ధ్య కాస్త ట్రాక్ త‌ప్పిన‌ట్లు అనిపించిన యువ‌ సంగీత సంచ‌ల‌నం య‌స్.య‌స్. థ‌మ‌న్… గ‌త రెండేళ్ళుగా మ‌ళ్ళీ ఫామ్ లోకి వ‌చ్చేశాడు. మ్యూజిక‌ల్ హిట్స్ తో సెన్సేష‌న్ క్రియేట్ చేస్తున్నాడు. ఒక‌వైపు థ‌మ‌న్ సంగీత సార‌థ్యంలో రూపొందిన `వెంకీమామ‌`, `ప్ర‌తి రోజూ పండ‌గే`, `అల వైకుంఠ‌పుర‌ములో`, `డిస్కో రాజా` విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతుంటే… మ‌రోవైపు `క్రాక్`, `ట‌క్ జ‌గ‌దీష్‌`, `సోలో బ్ర‌తుకే సో బెట‌ర్` వంటి ప్రాజెక్ట్స్ నిర్మాణ ద‌శ‌లో ఉన్నాయి. ఈ ఊపులోనే… థ‌మ‌న్ చెంత‌కు మ‌రో క్రేజీ ప్రాజెక్ట్ కి చేరింద‌ని టాక్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆ వివ‌రాల్లోకి వెళితే… `సింహా`, `లెజెండ్` వంటి బ్లాక్ బ‌స్ట‌ర్స్ త‌రువాత న‌టసింహ బాల‌కృష్ణ‌, స్టార్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను కాంబోలో మ‌రో సినిమా రాబోతున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రానికి సంగీత ద‌ర్శ‌కుడిగా థ‌మ‌న్ ఎంపిక‌య్యాడ‌ని స‌మాచారం. ఇదివ‌ర‌కు అనిరుధ్, మ‌ణిశ‌ర్మ పేర్లు వినిపించినా.. ఆ అవ‌కాశం థ‌మ‌న్ కి ద‌క్కింద‌ని వినికిడి. త్వ‌ర‌లోనే థ‌మ‌న్ ఎంట్రీపై క్లారిటీ వ‌స్తుంది.

అన్న‌ట్టు… ఇదివ‌ర‌కు బాల‌కృష్ణ కాంబినేష‌న్ లో `డిక్టేట‌ర్`కి, బోయ‌పాటి కాంబోలో `స‌రైనోడు`కి థ‌మ‌న్ ప‌నిచేశాడు. మ‌రి… ఇద్ద‌రితోనూ మ‌రోసారి జ‌ట్టుక‌ట్ట‌నున్న థ‌మ‌న్ కి ఈ సారి ఎలాంటి ఫ‌లితం ద‌క్కుతుందో చూడాలి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen − 4 =