ఇటీవల ‘వినరా సోదర వీర కుమారా’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రీనివాస సాయి ‘మథనం’ అనే మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అజయ్ సాయి మనికందన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్ధంగా వుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన టీజర్, ట్రయిలర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై బాగానే అంచనాలు ఏర్పడ్డాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఈ సినిమాను యూఎస్ లో మాత్రమే రిలీజ్ చేయనున్నారు. డిసెంబర్ 6వ తేదీన ఈ సినిమా అక్కడ థియేటర్ లలో సందడి చేయనుంది. అంతేకాదు ఇక్కడ రిలీజ్ కాకుండా.. కేవలం యూఎస్ లో మాత్రమే రిలీజ్ అవుతున్న సినిమా ఇదే.
For the First time in the history of Telugu cinema #Madhanam Releasing only in the USA on Dec 6th!!
Here’s the list of theatres👇#MadhanamOnDec6th#SrinivasSayee #BhavanaRao
A #AjaySaiManikandan Film@pgvinda @RonYohann @KasiProductions #DivyaPrasad #AshokPrasad pic.twitter.com/xjIrtHh2Dz— Telugu FilmNagar (@telugufilmnagar) December 5, 2019
కాగా యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో శ్రీనివాస సాయి సరసన భావన రావ్ హీరోయిన్ గా నటిస్తోంది. గేమ్ ఓవర్ సినిమాకు సంగీతం అందించిన రాన్ ఎహాన్ ఈ సినిమాకు కూడా సంగీతం అందిస్తున్నారు. కాశీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై అషోక్ ప్రసాద్, దివ్వ ప్రసాద్ సంయుక్తంగా సినిమాను నిర్మిస్తున్నారు. కో ప్రొడ్యూసర్ – మదన్ తీగల, ఎడిటింగ్ – కోటగిరి వెంకటేశ్వరరావు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























