
ట్యాగ్ · 2 కథనాలు

రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న ‘సైకో’

"సైకో" మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్
పిశాచి, డిటెక్టివ్ వంటి డబ్బింగ్ మూవీస్ ద్వారా తమిళ దర్శకుడు మిస్కిన్ తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. ఇప్పుడు మిస్కిన్ ఒక సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ ని రూపొందించారు. డబల్ మీనింగ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఉదయా నిధి స్టాలిన్ హీరో గా మిస్కిన్ దర్శకత్వంలో రూపొందిన "సైకో" మూవీ జనవరి 24వ తేదీ రిలీజ్ కానుంది. అదితి రావు హైదరి, నిత్యా మీనన్ ప్రధాన పాత్రలలో నటించగా రామ్ , షాజి చెన్ , సింగంపులి, నరేన్, రేణుక ముఖ్య పాత్రలలో నటించారు.
రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న ‘సైకో’
‘తుప్పరివాలన్’(తెలుగులో ‘డిటెక్టివ్’) వంటి సక్సెస్ ఫుల్ యాక్షన్ థ్రిల్లర్ తరువాత దర్శకుడు మిస్కిన్ తెరకెక్కించిన తమిళ చిత్రం ‘సైకో’. ఇందులో నిత్యా మీనన్, అదితీరావు హైదరి, ఉదయనిధి స్టాలిన్ ప్రధాన పాత్రల్లో నటించారు. సైకలాజికల్ థ్రిల్లర్గా రూపొందిన ఈ సినిమాలో ఉదయనిధి స్టాలిన్ అంధుడి పాత్రలో కనిపించనుండగా... అదితిరావు హైదరి రేడియో జాకీగా దర్శనమివ్వనుంది. మ్యూజిక్ మేస్ట్రో ఇళయరాజా సంగీతం అందించారు.