పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీ హిట్ ‘అత్తారింటికి దారేది’కి ఆరేళ్ళు

6 Years Completed For Powerstar Pawan Kalyan Attarintiki Daredi Movie, 6 Years For Pawan Kalyan Memorable Blockbuster Attarintiki Daredi, Attarintiki Daredi Movie Updates, Attarintiki Daredi Telugu Movie Latest News, Latest Telugu Movies News, Pawan Kalyan Attarintiki Daredi Movie Completes 6 Years, Six Years For Attarintiki Daredi Telugu Movie, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates

కుటుంబ బంధాలకు పెద్ద పీట వేస్తూ సినిమాలను రూపొందించడంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ తీరే వేరు. అలా… త్రివిక్రమ్ రూపొందించిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ లో ‘అత్తారింటికి దారేది’ ఒకటి. ‘జల్సా’ వంటి మ్యూజికల్ బ్లాక్ బస్టర్ తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా త్రివిక్రమ్ రూపొందించిన సినిమా ఇది. సమంత, ప్రణీత కథానాయికలుగా నటించిన ఈ సినిమాలో నదియా, రావు రమేష్, బొమన్ ఇరాని, ముఖేష్ రిషి, ప్రగతి, ఎం.ఎస్.నారాయణ, బ్రహ్మానందం, అలీ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

దేవిశ్రీ ప్రసాద్ సంగీత సారథ్యంలో రూపొందిన పాటలన్ని అప్పట్లో యువతరాన్ని ఉర్రూతలూగించాయి. “ఆరడుగుల బుల్లెట్టు”, “బాపు గారి బొమ్మో”, “కిర్రాకు”, “ఇట్స్ టైమ్ టు పార్టీ”, “నిన్ను చూడగానే”, “దేవదేవమ్‌”, “కాటమరాయుడా”… ఇలా ఇందులోని ప్రతి పాట విశేషాద‌ర‌ణ పొందింది.

శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మించిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను… కన్నడంలో ‘రన్న’ పేరుతోనూ, బెంగాలీలో ‘అభిమాన్’ టైటిల్‌తోనూ, తమిళంలో ‘వంద రాజవదాన్ వరువేన్’ పేరుతోనూ పునర్నిర్మించారు. 2013 సెప్టెంబర్ 27న విడుదలై ఇండస్ట్రీ హిట్‌గా నిలచిన ‘అత్తారింటికి దారేది’… నేటితో ఆరు వసంతాలను పూర్తి చేసుకుంటోంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × three =