హైదరాబాద్ లో దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్స్ వేడుక

Dadasaheb Phalke South Award Winners 2019,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Movie Updates,Dada Saheb Phalke Awards South 2019 Winners,Dadasaheb Phalke Awards South 2019 Winners,Dadasaheb Phalke International Film Festival,Dadasaheb Phalke Awards South 2019 List

భారతీయ చలన చిత్ర పరిశ్రమ పితామహుడు దాదా సాహెబ్ ఫాల్కే 150 వ జయంతి సందర్భంగా దాదా సాహెబ్ ఫాల్కే ఇంటర్ నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ వేడుకలు నిర్వహిస్తున్నారు. ముంబై, ఢిల్లీ లలో అవార్డ్స్ వేడుకలు జరిగాయి. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్స్ సౌత్ 2019 అవార్డ్స్ వేడుక తొలిసారిగా హైదరాబాద్ లోని N కన్వెన్షన్ సెంటర్ లో నిన్న (20వ తేదీ ) గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుక కు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ముఖ్య అతిథి గా పాల్గొన్నారు. పలువురు సినీప్రముఖులు హాజరయ్యారు.

ఉత్తమ నటుడు – మహేష్ బాబు (భరత్ అనే నేను ), ఉత్తమ నటి- అనుష్క (భాగమతి ), ఉత్తమ దర్శకుడు -సుకుమార్(రంగస్థలం ),అవుట్ స్టాండింగ్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ ది ఇయర్ మేల్ యశ్ (KGF ), అవుట్ స్టాండింగ్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ ది ఇయర్ ఫిమేల్ కీర్తి (మహానటి ),బెస్ట్ డెబ్యూ పాయల్ రాజ్ పుత్ (RX 100), ఉత్తమ నటుడు నెగటివ్ రోల్ జగపతి బాబు (అరవింద సమేత ), ఉత్తమ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ (రంగస్థలం), ఉత్తమ సినిమాటోగ్రాఫర్ రత్న వేలు (రంగస్థలం), జీవన సౌఫల్య పురస్కారం – కలెక్షన్ కింగ్ మోహన్ బాబు అవార్డ్స్ విజేతలు. ఉత్తమ నటుడు ( మహేష్ బాబు ) అవార్డ్ ఆయన సతీమణి నమ్రత గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ చేతులమీదుగా అందుకొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here