మూడు పాట‌ల‌తో తెర‌కెక్క‌నున్న ‘ఆర్ ఆర్ ఆర్’?

Latest Telugu Movies News, List Of Songs Available In RRR Movie, RRR Movie Full Album, RRR Movie Jukebox Songs, RRR Movie Songs, RRR Movie to Have Only 3 Songs in Album, RRR Movie Updates, RRR Songs, RRR Telugu Movie Latest News, RRR Telugu Movie Songs, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates

వాస్తవిక పాత్రలు, కల్పిత ఘటనలతో రూపొందుతున్న పేట్రియాటిక్ డ్రామా ‘ఆర్ ఆర్ ఆర్’. `బాహుబ‌లి` సిరీస్ త‌రువాత దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం … కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు మధ్య చిగురించిన స్నేహం, ఒకరి జీవితంపై మరొకరి ప్రభావం అనే ఆసక్తికరమైన అంశాలతో రూపొందుతోంది. కొమరం భీమ్‌గా తార‌క్‌… అల్లూరి సీతారామరాజుగా చరణ్ నటిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను… తెలుగుతో పాటు ప‌లు భారతీయ‌ భాష‌ల్లో ఒకే రోజున‌ విడుద‌ల చేయనున్నారు. ఇదిలా ఉంటే… ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త టాలీవుడ్ సర్కిల్స్‌లో హ‌ల్‌చ‌ల్‌ చేస్తోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అదేమిటంటే… ఈ చిత్రంలో కేవలం మూడే పాటలు ఉంటాయని… వాటితో పాటు పలు సన్నివేశాల్లో వచ్చే నేపథ్య సంగీతంతో కూడిన పాట ఒకటి ఉంటుందని తెలుస్తోంది. ఈ సినిమా ఒక ఇంటెన్ష‌న్‌ యాక్షన్ డ్రామా కావడం… అందులోనూ కొమరం భీమ్, అల్లూరి వంటి స్వాతంత్ర్య సమరయోధుల కథ కావడంతో, పాట‌లు కథాగమనానికి అడ్డు కాకూడదనే మేక‌ర్స్‌ ఈ నిర్ణ‌యం తీసుకున్నారని టాక్. అంతేకాదు… సందర్భోచితంగా వచ్చే ఈ మూడు గీతాలు సినిమాకు మరింత ప్లస్ అవడమే కాకుండా… ప్రేక్షకులను కూడా అలరిస్తాయని అంటున్నారు. ఇప్పటికే సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి బాణీల‌ను స్వ‌ర‌పరిచార‌ని… త్వ‌ర‌లో రికార్డింగ్ కూడా చేయ‌బోతున్నార‌ని తెలుస్తోంది.

కాగా… తాజాగా బల్గేరియా షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న ‘ఆర్ ఆర్ ఆర్’కు సంబంధించి నెక్ట్స్ షెడ్యూల్ హైదరాబాద్‌లో జరుగ‌నుంది. ప్రముఖ నిర్మాత డి.వి.వి దానయ్య ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ క్రేజీ మల్టీస్టారర్… 2020 జూలై 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three + 6 =