మొత్తానికి ‘మహానటి’ సినిమా తర్వాత కీర్తి సురేష్ వరుస సినిమాలతో దూసుకుపోతుంది. నేను శైలజ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన కీర్తి సురేష్ ఆ తర్వాత నేను లోకల్ సినిమాతో హిట్ అందుకుంది. ఇక ఆ తర్వాత మహానటి సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ‘మహానటి’ సినిమాతో ఒక్కదారిగా జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్నది. అంతే ఈ సినిమాకు గాను ఆమెకు జాతీయ ఉత్తమ నటి అవార్డు కూడా వచ్చింది. ఈ సక్సెస్ ఫామ్‌లో వరుస సినిమాలకు సైన్ చేస్తూ మరింత బిజీ అవుతుంది కీర్తి సురేష్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పటికే ఈ భామ ఖాతాలో చాలా సినిమాలు ఉండగా ఇటీవలే మరో సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం కీర్తి నరేంద్ర నాథ్ అనే కొత్త డైరెక్టర్ తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుది. ఇటీవలే ఈ సినిమాకు ‘మిస్ ఇండియా’ అనే ను టైటిల్ ను రిలీజ్ చేశారు చిత్ర యూనిట్.
దీనితో పాటు నగేష్ కుక్కునూరు దర్శకత్వంలో కూడా ఓ సినిమాలో నటిస్తుంది. ఆది పినిశెట్టి, జగపతి బాబు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ ను జరుపుకుంటుంది. దీనితో పాటు మలయాళంలో ‘మరక్కార్: ది అరభికడలింటే సింహమ్’ అనే సినిమాలో కూడా నటిస్తుంది.
బాలీవుడ్ లో కూడా కీర్తీ సురేష్ ‘మైదాన్’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ‘బదాయి హో’ ఫేమ్ అమిత్ శర్మ 1950-63 మధ్య కాలంలో భారత ఫుట్‌బాల్ జట్టుకు కోచ్‌గా వ్యవహరించిన సయ్యద్ అబ్దుల్ రహీం జీవితకథను తెరకెక్కించనున్నారు. ఈసినిమాలో బాలీవుడ్ యాక్షన్ హీరో అజయ్ దేవగన్ సరసన నటించే ఛాన్స్‌ను కొట్టేసింది కీర్తి సురేష్.
ఈ సినిమాలతో పాటు ఈశ్వర్ కార్తిక్ దర్శకత్వంలో కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో ఎమోషనల్ థ్రిల్లర్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోన్న మరో సినిమాలో నటిస్తుంది. ఈ ఎమోషనల్ మిస్టరీ థ్రిల్లర్ ను స్టోన్ బెంచ్ ఫిలిమ్స్ ప్రొడక్షన్ లో కార్తికేయ సంతానం నిర్మిస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా చిత్రీకరణ కొడైకెనాల్‌లో ప్రారంభమైంది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది మొదట్లో విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారట యూనిట్.
మొత్తానికి కీర్తి సురేష్ తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం ఎలా ఇలా భాషా భేదం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతుంది. మరి ఈ సినిమాల్లో ఏ సినిమా హిట్ అవుతుంది..?ఏ సినిమా ఫట్ అవుతుందో చూద్దాం..?
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: