పూరీ-రామ్ కాంబినేషన్ సూపర్ గా వర్కవుట్ అయింది. ఒక టెర్రిఫిక్ డైరెక్టర్ కు ఒక టెర్రిఫిక్ హీరో తోడైతే ఎలా ఉంటుందో ఇస్మార్ట్ శంకర్ చూపించింది. బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ రాబడుతూ దూసుకుపోతుంది. ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాల వరకే 22కోట్ల షేర్ సాధించి..ఈ సినిమా నిర్మాతలైన పూరీ కి ఛార్మీకి మంచి లాభాలు తెచ్చిపెడుతుంది. మరోవైపు రామ్ మాస్ అవతారం.. పూరీ మార్క్ తెలంగాణ డైలాగులు థియేటర్లలో గోల పెట్టిస్తున్నాయి. మాస్ సినిమాలకు టాక్ బాగా వస్తే కలెక్షన్లు ఎలా ఉంటాయో ఇప్పుడు ఇస్మార్ట్ శంకర్ చూపిస్తున్నాడు. బాక్సాఫీస్ దగ్గర మరో సినిమా లేకపోవడం దీనికి బాగా కలిసొస్తుంది. మరి డియర్ కామ్రేడ్ సినిమా రిలీజ్ అయిన తరువాత పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా.. ఈ సినిమాపై విమర్శలు చేస్తున్న క్రిటిక్స్ కు తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చాడు. “హీరో హెల్మెట్ పెట్టుకోలేదు…,హీరో స్మోక్ చేస్తున్నాడు…,హీరో అమ్మాయిలకి రెస్పెక్ట్ ఇవ్వలేదు…,ఎంత సేపూ…. ఇవేగాని, అక్కడ హీరో అడ్డమొచ్చిన వాడినల్లా చంపేస్తున్నాడని ఒక్కడు కూడా కంప్లైంట్ చేయడం లేదు.. ప్రాణాలకు విలువ లేదు, బాధాకరం” అని తన ట్విట్టర్ ద్వారా తన సినిమాను విమర్శిస్తున్న వారిపై సెటైరికల్ గా ట్వీట్ చేశారు.
Hero helmet pettukoledhu..
Hero smoke chestunnadu..
Hero ammailaki respect ivvatledhu..
Entha sepu ivve gaani.. Akkada hero addamochinavaalani champestunaadu..ani okkallu kuda complain cheyadam ledhu.. No value for life! SAD! #iSmartShankar – “A” Badass fictional character.— Ustaad iSmart Shankar (@ramsayz) July 23, 2019
[youtube_video videoid=rDoFiOjoC2Y]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: