తన నిక్ నేమ్ ఏంటో చెప్పిన నాని

Nani About Gang Leader Teaser,Telugu Filmnagar,Telugu Film News 2019,Telugu Cinema Updates,Latest Telugu Movie News,Gang Leader Movie Updates,Gang Leader Telugu Movie Latest News,Gang Leader Movie Teaser Release Date Locked,Gang Leader Telugu Movie Teaser Release Date Confirmed,Natural Star Nani Gang Leader Movie Teaser Releasing Soon
Nani About Gang Leader Teaser

విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో న్యాచురల్ స్టార్ నాని హీరోగా గ్యాంగ్ లీడర్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఆగష్టు 30వ తేదీన రిలీజ్ చేద్దామని.. రిలీజ్ డేట్ కూడా ఎప్పుడో ఫిక్స్ చేసేశారు. అయితే సాహో పోస్ట్ పోన్ అవ్వడంతో.. గ్యాంగ్ లీడర్ సెప్టెంబర్ కు వాయిదా చేసే ఆలోచనలో ఉన్నారు.

ఇక ఇటీవలే ఈ సినిమా నుండి ప్రీ లుక్, ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేయగా ఇప్పుడు టీజర్ అప్ డేట్ ఇచ్చాడు నాని. 24వ తేదీన ఉదయం 11 గంటలకు ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేయనున్నారు చిత్రయూనిట్. అంతేకాదు ఈసినిమాలో తన నిక్ నేమ్ కూడా చెప్పేశాడు. పెన్సిల్ అనే పేరుతో నానిని పిలవనున్నట్టు తెలుస్తోంది.

కాగా ఈసినిమాలో ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయికగా నటిస్తుండగా ‘ఆర్ ఎక్స్ 100’ హీరో కార్తికేయ ప్రతినాయకుడిగా కనిపించనున్నాడు. లక్ష్మి, శరణ్య, అనీష్ కురువిల్లా, ప్రియదర్శి, వెన్నెల కిషోర్, రఘు బాబు, సత్య ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా కు అనిరుధ్‌ రవిచందర్ సంగీత‌మందిస్తున్నాడు.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

[youtube_video videoid=idr0VLeZvMQ]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here