శివ నిర్వాణ దర్శకత్వంలో నాని, ఆది పినిశెట్టి, నివేదా థామస్ హీరో హీరోయిన్లుగా నిన్ను కోరి సినిమా 2017లో వచ్చిన సంగతి తెలిసిందే. లవ్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈసినిమా హిట్ టాక్ తెచ్చుకొని మంచి కలెక్షన్సే రాబట్టింది. నాని, నివేథా థామస్, ఆది.. ముగ్గురూ కూడా ఈ సినిమాలో అద్భుతమైన నటనతో చాలా మంచి పేరు సంపాదించారు. ఇక ఇప్పుడు ఈ సినిమాను తమిళ్ లో రీమేక్ చేస్తున్నట్టు తెలుస్తోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
తమిళంలో కన్నన్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇక తెలుగులో బ్రేకప్ లవర్ పాత్రను పోషించిన నాని పాత్రను తమిళంలో అధర్వ చేస్తుండగా… నివేదా థామస్ పాత్రలో అనుపమ పరమేశ్వరన్ నటించనున్నట్టు తెలుస్తోంది. అయితే ఆది పినిశెట్టి పాత్రను తమిళంలో ఎవరు చేస్తారనే దానిపై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. అయితే ఆది పాత్రలో ఆదినే నటించే అవకాశం ఉన్నట్టు టాక్స్ వస్తున్నాయి. మరి కన్నన్ ఆదినే సెలక్ట్ చేసుకుంటాడో…లేక వేరే ఎవరినైనా తీసుకుంటాడో దీనిపై క్లారిటీ రావాలంటే మాత్రం కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. మరి తెలుగులో హిట్ అయిన సినిమా తమిళ్ ప్రేక్షకులను ఎంత వరకూ నచ్చుతుందో.. ‘నిన్ను కోరి’ మ్యాజిక్ తమిళంలోనూ రిపీటవుతుందో?లేదో? చూద్దాం..
[subscribe]
[youtube_video videoid=4nPKyUVwDkA]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: