చిత్రీకరణ పూర్తి చేసుకున్న ‘సైరా’

Sye Raa Narasimha Reddy Shoot Wrapped Up,Sye Raa Narasimha Reddy Movie Shoot Wraps Up,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Sye Raa Narasimha Reddy Movie Updates,Sye Raa Narasimha Reddy Telugu Movie Latest News,#SyeRaa,Sye Raa Narasimha Reddy Movie Shooting Updates,Sye Raa Narasimha Reddy Telugu Movie Shooting Completed
Sye Raa Narasimha Reddy Shoot Wrapped Up

మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా న‌టించిన‌ చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. తొలి తెలుగు స్వాతంత్ర్య స‌మ‌ర యోధుడు ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి జీవితం ఆధారంగా ఈ హిస్టారిక‌ల్ డ్రామా తెర‌కెక్కింది. కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మించిన‌ ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించాడు. 2017 సంవత్సరాంతంలో ప్రారంభమైన ఈ సినిమా నిన్నటి(జూన్ 24)తో చిత్రీకరణను పూర్తి చేసుకుంది. ఈ విష‌యాన్ని సినిమాటోగ్రాఫర్ రత్నవేలు త‌న ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియ‌జేసారు. ఈ సంద‌ర్భంగా… ఈ చిత్రంలో నటించిన ప్రతీ ఒక్కరూ ఎంతో కష్టపడ్డారని, వారు అందించిన సహాయానికి, తోడ్పాటుకి ధన్యవాదాలు తెలియజేస్తూ… ఇదొక మరపురాని ప్రయాణమని పేర్కొన్నారు ర‌త్న‌వేలు. సినిమా అవుట్‌పుట్ చాలా బాగా వచ్చిందనీ, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో భాగంగా డీఐ వర్క్స్ కూడా ప్రారంభించినట్టు ఆయ‌న‌ తెలియజేసారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అమితాబ్ బచ్చన్, నయనతార, త‌మ‌న్నా, విజయ్ సేతుపతి, సుదీప్, జగపతిబాబు త‌దిత‌రులు ఇత‌ర ముఖ్య పాత్రలు పోషించిన‌ ఈ సినిమా గురించి దక్షిణాది ప్రేక్షకులతో పాటు ఉత్తరాది ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

సుదీర్ఘ‌ కాలం చిత్రీకరణ జరుపుకున్న `సైరా`… గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంద‌ని స‌మాచారం.

[subscribe]

[youtube_video videoid=Y8juZs0Q2DY]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × three =