ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ మూవీ రివ్యూ – ఫన్ అండ్ థ్రిల్లింగ్

Agent Sai Srinivasa Athreya Movie Public Talk, Agent Sai Srinivasa Athreya Movie Review, Agent Sai Srinivasa Athreya Movie Review And Ratings, Agent Sai Srinivasa Athreya Movie Story, Agent Sai Srinivasa Athreya Telugu Movie Live Updates, Agent Sai Srinivasa Athreya Telugu Movie Public Response, Agent Sai Srinivasa Athreya Telugu Movie Review, Latest Telugu Movie Reviews, Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates
Agent Sai Srinivasa Athreya Movie Review

లైఫ్ ఈజ్ బ్యూటీ ఫుల్ సినిమాలో చిన్న పాత్ర చేసిన నవీన్ పోలీశెట్టి ఇప్పుడు తాను హీరోగా ఏజెంట్ శ్రీనివాస ఆత్రేయ అనే సినిమాతో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వస్తున్నాడు. టీజర్, ట్రైలర్ తోనే ఈ సినిమాపై ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేశారు చిత్రయూనిట్. మరి ఈరోజు విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులకు ఎంత వరకూ నచ్చిందో తెలియాలంటే మాత్రం రివ్యూలోకి వెళ్లాల్సిందే.

నటీనటులు : నవీన్‌ పొలిశెట్టి, శృతి శర్మ, దర్బా అప్పాజి అంభరీష, విశ్వనాథ్‌
దర్శకత్వం : స్వరూప్‌ ఆర్‌ఎస్‌జే
నిర్మాత : రాహుల్‌ యాదవ్‌ నక్క
సంగీతం : మార్క్‌ కే రాబిన్‌

కథ:
శ్రీను అలియాస్ ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ (నవీన్‌ పొలిశెట్టి) నెల్లూరులో ఫాతిమా బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ ( ఎఫ్‌బీఐ) అనే పేరుతో ఓ ప్రైవేట్‌ డిటెక్టివ్‌ ఏజెన్సీ నడుపుతుంటాడు. అయితే పేరుకే ఈ ఏజేన్సీ నడుపుతుంటాడు కానీ అతని దగ్గరకు పెద్దగా కేసులు మాత్రం రావు. ఒకవేళ వచ్చినా అవి ఏదో చిన్నా చితకా కేసులు వస్తుంటాడు. ఆ కేసుల్లో పోలీసులకు హెల్ప్ చేస్తూ ఉంటాడు. ఓ పెద్ద కేసు వస్తే దాని ద్వారా తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకోవాలని చూస్తుంటాడు. ఆ క్రమంలో తన ఫ్రెండ్‌, క్రైమ్‌ రిపోర్టర్‌ శిరీష్‌ భారీగా దొరుకుతున్న అనాథ శవాల గురించి చెప్పటంతో ఆ కేసును ఇన్వెస్టిగేట్‌ చేయాలనుకుంటాడు. అలా చేసే ప్రయత్నంలో తననే అనుమానితుడిగా భావించి పోలీసులు అరెస్ట్ చేస్తారు. అలా అరెస్ట్ అయిన సాయి శ్రీనివాస ఆత్రేయ కు జైల్లో ఓ వ్యక్తి తన కూతురి హత్య గురించి చెబుతాడు. ఇక బెయిల్ పై బయటకు వచ్చిన ఆత్రేయ జైల్లో చెప్పిన కేసు గురించి ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలుపెడతాడు. ఆ ఇన్వెస్టిగేషన్ లో ఆత్రేయకు అనేక ఇబ్బందులు ఎదురవుతాయి..? ఆ కేసులో కూడా తననే నిందితుడని అరెస్ట్ చేస్తారు.. మరి ఆత్రేయ ఈ కేసుల నుంచి ఎలా బయటపడ్డాడు? ఆ హత్య చేసింది ఎవరు..? అసలు నిందితులను ఆత్రేయ ఎలా కనిపెట్టాడు..? ఈ విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సింటే.

విశ్లేషణ:

మన తెలుగులో డిటెక్టివ్ తరహా సినిమాలు కాస్త తక్కువగానే వస్తుంటాయని చెప్పొచ్చు. అలాంటి జోనర్ ను ఎంచుకొని డైరెక్టర్ స్వరూప్ వంద శాతం న్యాయం చేశాడు. నిజానికి ఇలాంటి సినిమాలకు స్క్రిప్ట్ ను హ్యాండిల్ చేయడం చాలా కష్టం. కానీ స్వరూప్ మాత్రం చాలా బాగా హ్యాండిల్ చేసి థియేటర్ కు వచ్చిన ప్రేక్షకుడికి కొత్త అనుభూతిని కలిగించాడు. ఇంట్రెస్టింగ్ స్టోరీతో పాటు గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో మొదటి సినిమా అయినా కూడా చాలా అనుభవం ఉన్న డైరెక్టర్ లాగా తెరకెక్కించిన విధానం బావుంది. అటు కామెడీ సన్నివేశాల్లో కానీ.. ఇటు సీరియస్ సన్నివేశాల్లో కానీ ఎక్కడా కూడా కృత్రిమత్వం లేకుండా చక్కని ఫ్లో ఉండేలా చూసుకున్నాడు. ఇలాంటి సినిమాలకు నెటీవిటీ అనేది ఉండదు.. కానీ నెల్లూరు యాసలోని నేటివిటీని తీసుకున్న డైరెక్టర్ ధైర్యానికిి హ్యాట్సాఫ్. అసలు పాత్రల ఎంపికలోనే డైరెక్టర్ సగం సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు.

ఇక ఈ సినిమాకు మరో హైలెట్ నటీనటుల నటన. ఆత్రేయగా నవీన్ పోలీశెట్టి తన పాత్రలో నటించడానికి కాదు..ప్రాణం పోశాడని చెప్పొచ్చు. అటు కామెడీతో పాటు ఇటు ఎమోషనల్ సీన్స్ లో కూడా తన నటనతో కట్టి పడేశాడు. నెల్లూరు యాసలో నవీన్ చేప్పే డైలాగ్స్ భలే నవ్విస్తాయి. కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకోవటంతో పాటు సీరియస్‌ ఇన్వెస్టిగేషన్‌ సీన్స్‌లోనూ..లుక్‌, యాటిట్యూడ్‌ ఇలా ప్రతీ విషయంలోనూ పర్ఫెక్షన్‌ చూపించాడు. ఇక నవీన్ కు అసిస్టెంట్ గా స్నేహ పాత్రలో చేసిన శృతి శర్మ కూడా బాగా నటించింది. హీరోకి అన్నివేళలా తోడుగా ఉంటూ తన ఇన్వెస్టిగేషన్ లో తన వంతు సాయం చేసే అసిస్టెంట్ పాత్రలో శృతి శర్మ యాక్టింగ్ బాగుంది. మిగిలిన వారు తమ పాత్రల మేర నటించి మెప్పించారు.

నేపథ్య సంగీతం ఈ చిత్రానికి హైలెట్ గా నిలిచింది. మార్క్‌ కె రాబిన్‌ అందించిన నేపథ్య సంగీతం సన్నివేశాలను మరింతగా ఎలివేట్ చేసింది. తన మ్యూజిక్‌తో మార్క్‌ సినిమా స్థాయిని పెంచాడు. విజువల్స్ బాగున్నాయి, నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి.

ఇక ఈ సినిమాలో ఉన్న చిన్న లోపం అంటే సెకండాఫ్ లో కొన్ని సన్నివేశాలు సాగదీయడమే. సెకండాఫ్ లో కొన్ని సన్నివేశాలు రిపీట్ అంయి లెంగ్త్ ఎక్కువగా అనిపిస్తుంది. దీనిలో ఎడిటర్ ను తప్పుపట్టలేం కానీ.. డైరెక్టర్ ఆ లెంగ్త్ ను కూడా కొంచెం క్రిస్ప్ గా కట్ చేసి ఉంటే బావుండేది. అయితే సినిమా అంతా బాగానే ఉంటుంది కాబట్టి .. ఈ చిన్న లోపం కనిపించదు.

ప్లస్ పాయింట్స్:
* కథ, స్క్రీన్ ప్లే
* నవీన్ పోలిశెట్టి, శృతి శర్మ నటన
* సంగీతం

మైనస్ పాయింట్స్:
* సెకండాఫ్ లో రిపీటెడ్ సీన్స్

ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ మూవీ రివ్యూ
  • Story
  • ScreenPlay
  • Direction
  • Performance
3
Sending
User Review
0 (0 votes)

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here