కలయా నిజమా… తొలి రేయి హాయి మహిమా`, `కొత్త కొత్తగా ఉన్నది`… అంటూ రొమాంటిక్ పెయిర్‌గా వెంకటేష్, టబు డ్యూయెట్లు పాడుకున్న చిత్రం ‘కూలీ నంబర్ 1’(1991). మ్యూజికల్ హిట్‌గా నిలచిన ఈ సినిమాతోనే టబు కథానాయికగా తొలి అడుగులు వేసింది. కట్ చేస్తే… 28 ఏళ్ళ తర్వాత ఈ జంట మరోసారి తెలుగు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నట్లు టాలీవుడ్ టాక్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే… హిందీనాట విజయం సాధించిన ‘దే దే ప్యార్ దే` చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయనున్న సంగతి తెలిసిందే. తెలుగు వెర్షన్ కి సంబంధించిన రీమేక్ రైట్స్‌ని డి.సురేష్ బాబు సొంతం చేసుకున్నాడు. కాగా… హిందీ వెర్షన్‌లో అజయ్ దేవగన్, టబు, రకుల్ ప్రీత్ సింగ్ ప్రధాన పాత్రల్లో నటించగా… తెలుగు వెర్షన్‌లో అజయ్ పాత్రలో వెంకీ కనిపించనున్నాడు. ఇక టబు పాత్ర కోసం ఆమెనే సంప్రదించిందట చిత్ర బృందం. టబు కూడా ఈ పాత్రను చేసేందుకు ఒప్పుకుందని సమాచారం. త్వరలోనే టబు ఎంట్రీపై క్లారిటీ వస్తుంది.
మరి… ‘కూలీ నెం.1’తో విజయాన్ని అందుకున్న వెంకీ, టబు జోడీ… ఇప్పుడు ‘దే దే ప్యార్ దే’ రీమేక్‌తోనూ మరోసారి ఆ మ్యాజిక్‌ను రిపీట్ చేస్తుందేమో చూద్దాం.
[subscribe]
[youtube_video videoid=iYozWD4rvtk]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: