స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, స్టన్నింగ్ బ్యూటీ పూజా హెగ్డే జంటగా ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఏస్ ఫిల్మ్ మేకర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకి ‘నాన్న నేను’, ‘అలకనంద’ వంటి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. గీతా ఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో… మాలీవుడ్ నటుడు జయరామ్ కీలక పాత్రలో నటించనున్నట్టు సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉంటే… ఇటీవలే తొలి షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం… జూన్ మొదటి వారం నుంచి తదుపరి షెడ్యూల్ జరుపుకోనుంది. ఈ గ్యాప్‌లో ఫ్యామిలీతో కలసి హాలిడే ట్రిప్ కోసం స్విట్జర్లాండ్‌కు వెళ్ళొచ్చిన బన్నీ… ఇక పూర్తిగా సినిమాపై దృష్టి పెట్టనున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే… ఈ సినిమాను సాధ్యమైనంత త్వరగా ఫినిష్ చేయాలని భావిస్తున్నాడట బన్నీ. అందుకే నాన్‌స్టాప్ షూటింగ్ ప్లాన్ జరుగుతోందని సమాచారం.
కాగా.. ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ను ఈ ఏడాది ద్వితీయార్ధంలో విడుదల చేయనున్నట్టు జోరుగా ప్రచారం సాగుతోంది. ఆ తరువాత సుకుమార్, వేణు శ్రీరామ్ ఐకాన్ చిత్రాలపై దృష్టి పెట్టనున్నాడు బన్నీ.
[subscribe]
[youtube_video videoid=lS5CrgkciTo]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























