హవీష్ హీరోగా అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై కొత్త సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను ఈరోజు లాంచనంగా ప్రారంభించారు. జూలైలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ కార్యక్రమానికి స్టార్ డైరెక్టర్ సుకుమార్, ఏషియన్ సినిమాస్ అధినేత సునీల్ నారంగ్ ముఖ్య అతిథులుగా హజరయ్యారు. ఈ నేపథ్యంలో హవీష్ పై తొలి షాట్‌కు సుకుమార్ క్లాప్ ఇవ్వగా… సునీల్ నారంగ్ దర్శకుడు రాఘవ్ ఓంకార్ శశిధర్‌కు స్క్రిప్ట్ అందచేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కనున్న ఈసినిమాను రాఘవ్ ఓంకార్ శ్రీధర్ దర్శకత్వం వహించనున్నాడు. ఈ సినిమాతో రాఘవ్ ఓంకార్ శ్రీధర్ డైరెక్టర్ గా పరిచయం కానున్నాడు. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌పై అభిషేక్ నామా నిర్మిస్తున్న ఈ సినిమాకు చైతన్ భరద్వాజ్ సంగీతమందిస్తుండగా సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫి అందిస్తున్నారు. మిగిలిన నటీనటుల గురించిన వివరాలను త్వరలోనే తెలియజేయనున్నారు చిత్రయూనిట్.
[subscribe]
[youtube_video videoid=VzajUuo4WwQ]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























